ఏడుపాయలలో మంజీర పరవళ్లు

ABN , First Publish Date - 2022-10-18T05:06:36+05:30 IST

సింగూరు ప్రాజెక్టు నుంచి విడుదల చేసిన నీరు ఏడుపాయల వనదుర్గామాత ఆలయ గర్భగుడి మండపాన్ని తాకి ఉధృతంగా ప్రవహిస్తున్నది.

ఏడుపాయలలో మంజీర పరవళ్లు

 పాపన్నపేట :  సింగూరు ప్రాజెక్టు నుంచి విడుదల చేసిన నీరు ఏడుపాయల వనదుర్గామాత ఆలయ గర్భగుడి మండపాన్ని తాకి ఉధృతంగా ప్రవహిస్తున్నది. వరదల కారణంగా రాజగోపురంలో దుర్గామాత ఉత్సవ విగ్రహం వద్ద భక్తులు పూజలు నిర్వహిస్తున్నారు. ముందు జాగ్రత్తలో భాగంగా గర్భగుడి నుంచి హుండీలను ముందే తరలించి భద్రంగా ఉంచిన ఆలయ చైర్మన్‌ బాలాగౌడ్‌, ఈవో సార శ్రీనివాస్‌ సోమవారం లెక్కింపు చేపట్టారు. 90 రోజులకు సంబంధించి లెక్కించగా హుండీ ఆదాయం రూ.31,20,723 వచ్చినట్లు ఈవో శ్రీనివాస్‌ తెలిపారు. వెండి మిశ్రమం, బంగారు ఆభరణాలు లాకర్‌లో భద్రపర్చి, ఆదాయాన్ని బ్యాంకులో జమచేయన్నుట్లు ఆయన పేర్కొన్నారు.  

Updated Date - 2022-10-18T05:06:36+05:30 IST