ఏడుపాయలలో మంజీరా నది ఉధృతి

ABN , First Publish Date - 2022-09-10T05:54:12+05:30 IST

సింగూర్‌ ప్రాజెక్టు నుంచి వస్తున్న వరదకు తోడు గతరాత్రి నుంచి కురుస్తున్న వర్షాలతో ఏడుపాయల వద్ద మంజీరా నది ఉధృతి శుక్రవారం మరింత పెరిగింది. వనదుర్గా ప్రాజెక్టు పొంగిపొర్లుతున్నది. వనదుర్గామాత ఆలయం జలదిగ్భంధంలో చిక్కుకుంది. అమ్మవారి ఉత్సవ విగ్రహాన్ని రాజగోపురంలో ఉంచి పూజలు చేస్తున్నారు.

ఏడుపాయలలో మంజీరా నది ఉధృతి
ఏడుపాయలలో పొంగిపొర్లుతున్న వనదుర్గా ప్రాజెక్టు

పాపన్నపేట, సెప్టెంబరు 9: సింగూర్‌ ప్రాజెక్టు నుంచి వస్తున్న వరదకు తోడు గతరాత్రి నుంచి కురుస్తున్న వర్షాలతో ఏడుపాయల వద్ద మంజీరా నది ఉధృతి  శుక్రవారం మరింత పెరిగింది. వనదుర్గా ప్రాజెక్టు పొంగిపొర్లుతున్నది. వనదుర్గామాత ఆలయం జలదిగ్భంధంలో చిక్కుకుంది. అమ్మవారి ఉత్సవ విగ్రహాన్ని రాజగోపురంలో ఉంచి పూజలు చేస్తున్నారు. ప్రతినెలా పౌర్ణమిని పురస్కరించుకొని చేపట్టే పల్లకీసేవను శుక్రవారం రాత్రి ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో చైర్మన్‌ బాలాగౌడ్‌, ఈవో శ్రీనివాస్‌ పాల్గొన్నారు.

Updated Date - 2022-09-10T05:54:12+05:30 IST