పాఠశాలలో మందుబాబుల వీరంగం
ABN , First Publish Date - 2022-04-10T04:46:22+05:30 IST
చేర్యాల మండలం కమలాయపల్లి గ్రామంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో మందుబాబులు రాత్రివేళ వీరంగం చేస్తున్నారు.
చేర్యాల, ఏప్రిల్ 9: చేర్యాల మండలం కమలాయపల్లి గ్రామంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో మందుబాబులు రాత్రివేళ వీరంగం చేస్తున్నారు. పాఠశాల ఆవరణలో మద్యం సేవించి సీసాలను తరగతి గదుల్లో ధ్వంసం చేసి వెళ్తున్నారు. దీంతో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. మద్యం మత్తులో మూత్రవిసర్జన చేస్తుండడంతో తరగతి గదులు కంపు కొడుతున్నాయి. ఈ విషయమై పోలీసులు రాత్రివేళ గస్తీ నిర్వహించి మందుబాబుల ఆగడాలను అరికట్టాలని విద్యార్థులు కోరుతున్నారు.