అప్పుల బాధతో వ్యక్తి ఆత్మహత్య

ABN , First Publish Date - 2022-07-04T05:20:24+05:30 IST

అప్పులబాధ తాళలేక ఓ వ్యక్తి పురుగుల మందు తాగి ఆదివారం ఆత్మహత్య చేసుకున్నాడు.

అప్పుల బాధతో వ్యక్తి ఆత్మహత్య

చేర్యాల, జూలై 3: అప్పులబాధ తాళలేక ఓ వ్యక్తి పురుగుల మందు తాగి ఆదివారం ఆత్మహత్య చేసుకున్నాడు. కుటుంబసభ్యులు తెలిపిన వివరాల ప్రకారం చేర్యాల మండలం కడవేరుగు గ్రామానికి చెందిన సూరెడ్డి జనార్ధన్‌రెడ్డి(61) వ్యవసాయంపై ఆధారపడి జీవిస్తున్నాడు. కాగా ఇరువురు కూతుళ్ల వివాహంతో పాటు ఇంటి నిర్మాణం, పంటల కోసం అప్పులు చేశాడు. కొంతమేర తీర్చినా ఇంకా రూ.5 లక్షలు చెల్లించాల్సి ఉండడంతో ఇబ్బందులు పడుతున్నాడు. ఆదివారం ఉదయం వ్యవసాయ బావి వద్దకెళ్లి పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. కాసేపటికి ఇంటికి తిరిగిరాగా, నోటిలోంచి నురగలు రావడాన్ని గమనించిన కుటుంబసభ్యులు చికిత్స నిమిత్తం చేర్యాల ప్రభుత్వాస్పత్రిలో చేర్పించారు. ప్రాథమిక చికిత్స చేపట్టినా, అప్పటికే ఆరోగ్యపరిస్థితి క్షీణించడంతో మృతిచెందాడు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ భాస్కర్‌రెడ్డి తెలిపారు.

Read more