పురుగుమందు తాగి వ్యక్తి ఆత్మహత్య
ABN , First Publish Date - 2022-10-07T06:02:38+05:30 IST
అనారోగ్యంతో బాధ పడుతున్న ఓ వ్యక్తి మనస్తాపంతో క్రిమిసంహారక మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
పాపన్నపేట, అక్టోబరు 6: అనారోగ్యంతో బాధ పడుతున్న ఓ వ్యక్తి మనస్తాపంతో క్రిమిసంహారక మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ సంఘటన మండలంలోని కొత్త లింగాయపల్లి గ్రామంలో ఆదివారం జరిగింది. ఎస్‌ఐ విజయ్‌కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. కొత్త లింగాయపల్లి గ్రామానికి చెందిన గౌరీ సాయిలు (37) వ్యవసాయం చేసుకుంటూ జీవిస్తున్నాడు.కొన్ని రోజులుగా ఆనారోగ్యంతో బాధపడుతున్నాడు. దీంతో తీవ్ర మనస్తాపం చెంది ఈ నెల 2న సాయంత్రం ఇంట్లో ఎవరూ లేని సమయంలో పురుగుల మందు తాగాడు. వాంతులు కావడంతో కుటుంబీకులు అతడిని వెంటనే మెదక్ ఏరియా ఆస్పత్రికి తీసుకెళ్లి, మెరుగైన చికిత్స కోసం గాంధీ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ బుధవారం మధ్యాహ్నం మృతి చెందాడు. మృతుడికి భార్యతో పాటు ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. మృతుడి అక్క సాయమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ తెలిపారు.