Mahmood Ali: సంగారెడ్డి పోలీస్ పరేడ్ గ్రౌండ్‌లో జాతీయ పతాక ఆవిష్కరణ

ABN , First Publish Date - 2022-08-15T17:27:59+05:30 IST

స్వాతంత్య్ర దినోత్సవం పురస్కరించుకుని సంగారెడ్డిలోని పోలీసు పరేడ్ గ్రౌండ్‌లో హోం మంత్రి మహమూద్ ఆలీ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు.

Mahmood Ali: సంగారెడ్డి పోలీస్ పరేడ్ గ్రౌండ్‌లో జాతీయ పతాక ఆవిష్కరణ

సంగారెడ్డి: స్వాతంత్య్ర దినోత్సవం పురస్కరించుకుని సంగారెడ్డిలోని పోలీసు పరేడ్ గ్రౌండ్‌లో హోం మంత్రి మహమూద్ అలీ (Mahmood Ali) జాతీయ పతాకాన్ని(National flag) ఆవిష్కరించారు. అనంతరం హోంమంత్రి మాట్లాడుతూ... స్వాతంత్ర్య ఉద్యమంలో ప్రాణాలు ఆర్పించిన త్యాగధనులకు నివాళులర్పించారు. భారత జాతీయోద్యమ స్పూర్తితో, అహింసా మార్గంలో పోరాడి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నామని తెలిపారు. అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమ ఫలాలను తెలంగాణ ప్రభుత్వం (Telangana government) అందిస్తుందన్నారు. సంగారెడ్డి మెడికల్ కాలేజ్ పనులు శరవేగంగా జరుగుతున్నాయని, త్వరలోనే 150 మందితో తరగతులు స్టార్ట్ అవుతాయని తెలిపారు. జిల్లాలో కొత్తగా 41,981 మందికి ఈ రోజు నుంచి ఆసరా పెన్షన్లు వస్తాయని మహమూద్ అలీ అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీ బీబీ పాటిల్ (BB patil), జిల్లా కలెక్టర్ శరత్ (Sharat) తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2022-08-15T17:27:59+05:30 IST