వైభవంగా గోపాష్టమి వ్రత మహోత్సవం

ABN , First Publish Date - 2022-11-01T23:55:42+05:30 IST

సంగారెడ్డి మండలం ఫసల్‌వాది గ్రామంలోని శ్రీ జ్యోతిర్వాస్తు విద్యాపీఠం ఆశ్రమంలో ఆశ్రమ వ్యవస్థాపకుడు మహేశ్వరశర్మ సిద్ధాంతి అధ్వర్యంలో గోపాష్టమి మహోత్సవాన్ని మంగళవారం అత్యంత వైభవంగా నిర్వహించారు.

వైభవంగా గోపాష్టమి వ్రత మహోత్సవం

సంగారెడ్డి రూరల్‌, నవంబరు 1: సంగారెడ్డి మండలం ఫసల్‌వాది గ్రామంలోని శ్రీ జ్యోతిర్వాస్తు విద్యాపీఠం ఆశ్రమంలో ఆశ్రమ వ్యవస్థాపకుడు మహేశ్వరశర్మ సిద్ధాంతి అధ్వర్యంలో గోపాష్టమి మహోత్సవాన్ని మంగళవారం అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ మహోత్సవంలో భాగంగా 1,198 మంది మహిళలతో ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు వ్రత క్రతువు నిర్వహించారు. కార్యక్రమంలో జడ్పీ చైర్‌ పర్సన్‌ మంజూశ్రీ జైపాల్‌రెడ్డి, డీఆర్‌వో రాధికారమణి, సంగారెడ్డి డీఎస్పీ రవీంద్రారెడ్డి హాజరై ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఫసల్‌వాది గ్రామంలోని పురవీధుల్లో ఊరేగింపు నిర్వహించి, గోపాష్టమి వ్రత మహిమపై ప్రజలకు అవగాహన కల్పించారు. కార్యక్రమంలో ఆశ్రమ సభ్యులు సాయి, ప్రశాంత్‌కుమార్‌, సత్యనారాయణ, నరే్‌షకుమార్‌, రాము, పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

Updated Date - 2022-11-01T23:55:44+05:30 IST