ఆటోను ఢీకొన్న లారీ... నలుగురికి గాయాలు
ABN , First Publish Date - 2022-03-06T04:59:17+05:30 IST
మండలంలోని అన్నాసాగర్ చెరువు కట్టవద్ద ఆటోను లారీ ఢీకొన్న ఘటనలో నలుగురికి గాయాలయ్యాయి.
క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించిన ఎమ్మెల్యే క్రాంతికిరణ్
జోగిపేట, మార్చి 5: మండలంలోని అన్నాసాగర్ చెరువు కట్టవద్ద ఆటోను లారీ ఢీకొన్న ఘటనలో నలుగురికి గాయాలయ్యాయి. వివరాల్లోకి వెళ్తే.. మండలంలోని కన్‌సాన్‌పల్లి నుంచి జోగిపేట వైపు వెళ్తున్న ఆటో అన్నాసాగర్ చెరువు కట్టవద్ద కు చేరుకోగానే ఎదురుగా వస్తున్న ఓ లారీ ఢీ కొట్టింది. ఈ ఘటనలో ఆటోలో ప్రయాణిస్తున వనిపురం రఘు, నర్సింహులు (కన్‌సాన్‌పల్లి), రాములు (కిచ్చన్నపల్లి), శంకరయ్య (ఎర్రారం)లు తీవ్రంగా గాయపడ్డారు. అదే సమయంలో జోగిపేటకు వెళ్తూ ఘటనాస్థలానికి చేరుకున్న ఎమ్మెల్యే క్రాంతికిరణ్ తన వాహనాన్ని నిలిపి క్షతగాత్రులకు పైకి లేపి గాయాలను నీటితో కడిగారు. అనంతరం బాధితులను మరో వాహనంలో జోగిపేట ఆస్పత్రికి తరలించారు. ఎమ్మెల్యే ఆసుపత్రి సూపరింటెండెంట్‌కు ఫోన్ చేసి వారికి మెరుగైన చికిత్స అందజేయాలని ఆదేశించారు.