ట్రావెల్స్‌ బస్సుల్లో తరలిస్తున్న మద్యం, గంజాయి చాక్లెట్లు స్వాధీనం

ABN , First Publish Date - 2022-12-09T23:56:19+05:30 IST

ట్రావెల్స్‌ బస్సుల్లో తరలిస్తున్న మద్యం, గంజాయితో చేసిన చాక్లెట్లను స్వాధీనం చేసుకున్నట్టు ఎక్సైజ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అసిస్టెంట్‌ సూపరింటెండెంట్‌ శ్రీనివాసరావు విలేకరుల సమావేశంలో వెల్లడించారు.

ట్రావెల్స్‌ బస్సుల్లో తరలిస్తున్న  మద్యం, గంజాయి చాక్లెట్లు స్వాధీనం

జహీరాబాద్‌, డిసెంబరు 9: ట్రావెల్స్‌ బస్సుల్లో తరలిస్తున్న మద్యం, గంజాయితో చేసిన చాక్లెట్లను స్వాధీనం చేసుకున్నట్టు ఎక్సైజ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అసిస్టెంట్‌ సూపరింటెండెంట్‌ శ్రీనివాసరావు విలేకరుల సమావేశంలో వెల్లడించారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం మెదక్‌ డివిజన్‌ ఎక్సెజ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అసిస్టెంట్‌ కమిషనర్‌ రఘురామ్‌ ఆదేశాల మేరకు నమ్మదగిన సమాచారంతో శుక్రవారం 65వ జాతీయ రహదారిపై జహీరాబాద్‌ పరిధిలోని చిరాగ్‌పల్లి చెక్‌పోస్టు వద్ద వాహనాలను తనిఖీ చేశారు. గోవా నుంచి హైదరాబాద్‌కు వస్తున్న ట్రావెల్స్‌ బస్సును తనిఖీ చేయగా డైవ్రర్‌ సీటు వెనకాల ఉంచి తరలిస్తున్న 22 మద్యం బాటిళ్లు లభ్యమైనట్టు ఆయన తెలిపారు. ఒక్కో మద్యం బాటిల్‌ రెండు లీటర్లు చొప్పున ఉందని పేర్కొన్నారు. డైవ్రర్‌ జబ్బార్‌ను అదుపులోకి తీసుకున్నట్టు తెలిపారు. మరో బస్సులో తనిఖీలు చేయగా డ్రైవర్‌ ఉమాకాంత్‌ 15 గంజాయి చాక్లెట్లు లభ్యమైనట్టు వివరించారు. ఇద్దరు డ్రైవర్లపై కేసు నమోదు చేశామని, బస్సులను సీజ్‌ చేశామని తెలియజేశారు. తనిఖీల్లో ఎక్సైజ్‌ సీఐ మోహన్‌కుమార్‌, సిబ్బంది హలీం, విఠల్‌, మల్కయ్య, కరీం తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-12-09T23:56:21+05:30 IST