హక్కుల పరిరక్షణ కోసం ఐక్యంగా ఉద్యమిద్దాం: ఎల్లేష్‌

ABN , First Publish Date - 2022-12-15T23:58:31+05:30 IST

జగదేవ్‌పూర్‌, నవంబరు 15: బీసీ-ఏ గ్రూపు కులాల హక్కుల పరిరక్షణ కోసం ఐక్యంగా ఉద్యమించాలని బీసీ-ఏ గ్రూపు పరిరక్షణ సమితి రాష్ట్ర ఉపాధ్యక్షుడు రాచమల్ల ఎల్లేష్‌ పిలుపునిచ్చారు.

హక్కుల పరిరక్షణ కోసం ఐక్యంగా ఉద్యమిద్దాం: ఎల్లేష్‌

జగదేవ్‌పూర్‌, నవంబరు 15: బీసీ-ఏ గ్రూపు కులాల హక్కుల పరిరక్షణ కోసం ఐక్యంగా ఉద్యమించాలని బీసీ-ఏ గ్రూపు పరిరక్షణ సమితి రాష్ట్ర ఉపాధ్యక్షుడు రాచమల్ల ఎల్లేష్‌ పిలుపునిచ్చారు. గురువారం మండలంలోని బీసీ-ఏ గ్రూపు కులాలకు చెందిన నాయకులతో ఏర్పాటు చేసిన సమావేశానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. ప్రభుత్వం బీసీ-ఏ గ్రూపు కులాల హక్కులను కాలరాసే ప్రయత్నం సాగిస్తుందని ఆరోపించారు. రాష్ట్రంలో అత్యధిక జనాభా కలిగిన ముదిరాజ్‌లను బీసీ-ఏ గ్రూపులో కలిపే ప్రయత్నాలకు పాల్పడుతుందని మండిపడ్డారు. దీంతో బీసీ-ఏ గ్రూపు కులాలందరికీ భవిష్యత్‌లో అన్నిరంగాల్లో తీరని అన్యాయం జరుగుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో పూసల సంఘం నాయకులు పన్నీరు సత్తయ్య, రామచంద్రం, సారయ్య, మురళి, వీరభద్ర సంఘం నాయకుడు వీరముష్టి వెంకటేష్‌, వడ్డెర సంఘం నాయకులు ఉపేందర్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-12-15T23:58:32+05:30 IST