మనూరును అన్ని రంగాల్లో అభివృద్ధి చేసుకుందాం

ABN , First Publish Date - 2022-12-15T00:07:55+05:30 IST

మండల సమావేశంలో ఎంపీపీ జయశ్రీ

మనూరును అన్ని రంగాల్లో అభివృద్ధి చేసుకుందాం
సమావేశంలో మాట్లాడుతున్న ఎంపీపీ జయశ్రీమోహన్‌రెడ్డి

మనూరు, డిసెంబరు 14: మనూరు మండలాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసుకుందామని ఎంపీపీ కొంగరి జయశ్రీమోహన్‌రెడ్డి అన్నారు. బుధవారం మనూరు మండల పరిషత్‌ కార్యాలయంలో జరిగిన మండల సర్వసభ్య సమావేశంలో ఆమె మాట్లాడారు. గ్రామాల్లో నెలకొన్న సమస్యలను ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయంతో కలిసి పరిష్కరించేందుకు కృషి చేయాలన్నారు. ప్రభుత్వం ద్వారా వస్తున్న సంక్షేమపథకాలను ప్రజలకు అందే విధంగా చూడాల్సిన బాధ్యత కూడా ప్రతీ ఒక్కరిపై ఉందన్నారు. ఈ సమావేశంలో ఎంపీడీవో షాజీలోద్దిన్‌, తహసీల్దార్‌ తారాసింగ్‌, వైస్‌ ఎంపీపీ రాములు, ఎంపీటీసీ పెంటయ్య, సర్పంచు మస్తాన్‌రావు, డాక్టర్లు రవికుమార్‌, నేతాజీ, ఏఈవోలు శ్రీనివా్‌సరెడ్డి, బాలలింగం, ఏపీవో షాయద్‌, ఆయా శాఖల అధికారులు పాల్గొన్నారు.

Updated Date - 2022-12-15T00:07:56+05:30 IST