కళలను కాపాడుకుందాం: ఓయూ సైన్స్‌ డీన్‌

ABN , First Publish Date - 2022-02-17T03:42:09+05:30 IST

కళలను కాపాడుకుందామని ఓయూ సైన్స్‌ డీన్‌ ప్రొఫెసర్‌ బాలకిషన్‌ పేర్కొన్నారు.

కళలను కాపాడుకుందాం: ఓయూ సైన్స్‌ డీన్‌

సంగారెడ్డి అర్బన్‌, ఫిబ్రవరి 16: కళలను కాపాడుకుందామని ఓయూ సైన్స్‌ డీన్‌ ప్రొఫెసర్‌ బాలకిషన్‌ పేర్కొన్నారు. సంగారెడ్డిలోని తారా డిగ్రీ కళాశాలలో ఎన్‌ఎ్‌సఎ్‌స, అర్థశాస్త్ర విభాగం ఆధ్వర్యంలో తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ మ్యూజిక్‌ అకాడమీ సహకారంతో 20 రోజులుగా కొనసాగుతున్న డప్పు శిక్షణ బుధవారం ముగిసింది. ముఖ్య అతిథిగా హాజరైన ఓయూ సైన్స్‌ డీన్‌ బాలకిషన్‌, ఫిల్మ్‌యాక్టర్‌ రామకృష్ణ మాట్లాడారు. జాంబవంతుడు అడవులలో జంతువుల నుంచి రక్షణ పొందుటకు డప్పు వాయించాడని గుర్తు చేశారు. ప్రిన్సిపాల్‌ ప్రవీణ మాట్లాడుతూ జనవరి 28 నుంచి ఈనెల 16వరకు సర్టిఫికెట్‌ కోర్సు కింద డప్పుశిక్షణ నిర్వహించామన్నారు. భవిష్యత్‌లో కోలాటం, జడకొప్పు, ఫైన్‌ ఆర్ట్స్‌ వంటి కోర్సులను ప్రవేశపెట్టేందుకు ప్రయత్నిస్తామన్నారు. కార్యక్రమంలో అందె మ్యూజిక్‌ అకాడమీ డైరెక్టర్‌ అందెభాస్కర్‌, రాష్ట్రపతి అవార్డు గ్రహీత డాక్టర్‌ రవితేజ, అధికారులు వెంకటేశం, జగదీశ్వర్‌, పద్మజ, సిద్ధులు పాల్గొన్నారు. 

Updated Date - 2022-02-17T03:42:09+05:30 IST