లింగారెడ్డిపేట శివారులో భూకబ్జాపై కేసులు

ABN , First Publish Date - 2022-09-17T05:30:00+05:30 IST

లింగారెడ్డిపేట శివారులో భూకబ్జాలపై శనివారం రాత్రి రెండు కేసులు నమోదు చేసినట్లు మనోహరాబాద్‌ ఎస్‌ఐ రాజుగౌడ్‌ వివరించారు.

లింగారెడ్డిపేట శివారులో భూకబ్జాపై కేసులు

తూప్రాన్‌ (మనోహరాబాద్‌), సెప్టెంబరు 17: లింగారెడ్డిపేట శివారులో భూకబ్జాలపై శనివారం రాత్రి రెండు కేసులు నమోదు చేసినట్లు మనోహరాబాద్‌ ఎస్‌ఐ రాజుగౌడ్‌ వివరించారు. లింగారెడ్డిపేట శివారులోని బండ్లబాటను కబ్జా చేశారని రైతులు ఫిర్యాదు చేయగా,  త్రిపుర కన్‌స్ట్రక్షన్స్‌, మరో ఇరువురిపై కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ రాజుగౌడ్‌ వివరించారు. అలాగే, లింగారెడ్డిపేట శివారులో మంత్రి విజయ్‌కుమార్‌ కుటుంబం కొనుగోలు చేసిన భూమి హద్దురాళ్లను త్రిపుర కన్‌స్ట్రక్షన్స్‌ తొలగించిందని, గ్రామానికి చెందిన ఇరువురి మద్ధతుతో భూమిని కబ్జా చేసినట్లు వివరించారు. భూమి వద్ద ఉంచిన కంటైనర్‌ను గోతిలో వేసి పూడ్చారని ఫిర్యాదు చేయగా, కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ వివరించారు.  

Read more