కోళ్లపల్లి టోల్‌ ప్లాజాలో డబుల్‌ దోపిడీ

ABN , First Publish Date - 2022-10-04T05:12:57+05:30 IST

హైదరాబాద్‌-నాందేడ్‌ 165వ నంబరు జాతీయ రహదారిపై కోళ్లపల్లి వద్ద ఉన్న టోల్‌ప్లాజా నిర్వహకులు డబుల్‌ఛార్జీలు వసూలు చేస్తూ ప్రయాణికులను దోచుకుంటున్నారు.

కోళ్లపల్లి టోల్‌ ప్లాజాలో డబుల్‌ దోపిడీ

ఆంధ్రజ్యోతి ప్రతినిధి, సంగారెడ్డి : హైదరాబాద్‌-నాందేడ్‌ 165వ నంబరు జాతీయ రహదారిపై కోళ్లపల్లి వద్ద ఉన్న టోల్‌ప్లాజా నిర్వహకులు డబుల్‌ఛార్జీలు వసూలు చేస్తూ ప్రయాణికులను దోచుకుంటున్నారు. ఈ రహదారిపై వెళ్లే కార్లు, జీపులకు వెళ్లేటప్పుడు రూ.70, వచ్చేటప్పుడు రూ.35లు టోల్‌చార్జి వసూలు చేయాల్సి ఉన్నది. అంటే 24 గంటల వ్యవధిలో టోల్‌ప్లాజాను రెండుసార్లు దాటితే రూ. 105 చెల్లించాల్సి ఉంటుంది. ఫాస్టాగ్‌ ఉంటే వాహన యజమాని ఖాతా నుంచి టోల్‌ప్లాజా ఖాతాలో ఈ మొత్తం జమవుతుంది. అయితే కోళ్లపల్లి టోల్‌ప్లాజా మీదుగా 24 గంటల వ్యవధిలోనే రెండుసార్లు వెళ్లినా రూ. 70 చొప్పున మొత్తం రూ. 140 వసూలు చేస్తున్నారు. దీంతో వాహనదారుల జేబుకు చిల్లు పడుతున్నది. ఈ నెల 2న టీఎ్‌స15ఈటీ 0577 కారు యజమాని ఖాతా నుంచి టోల్‌ ఫ్లాజా వద్ద రెండుసార్లు రూ. 70 చొప్పున టోల్‌ప్లాజా ఖాతాలోకి వెళ్లాయి. ఇదేమిటని టోల్‌ ఫ్లాజా నిర్వాహకులను అడిగితే దౌర్జాన్యానికి దిగారని వాహన యజమాని వాపోయారు. సంబంధిత అధికారులు కల్పించుకుని, డబుల్‌ ఛార్జీలు వసూలు చేస్తున్నవారిపై చర్యలు తీసుకోవాలని వాహన యజమానులు కోరుతున్నారు. ప్రతీరోజు ఈ రహదారిపై వేలాది వాహనాలు ప్రయాణిస్తుంటాయని, ఈలెక్కన రూ. లక్షల్లో వాహన యజమానులు నష్టపోతున్నారని వారు వాపోతున్నారు.

Updated Date - 2022-10-04T05:12:57+05:30 IST