దేశాన్ని ఏలే సత్తా కేసీఆర్‌కు ఉంది: మదన్‌రెడ్డి

ABN , First Publish Date - 2022-10-08T04:23:10+05:30 IST

దేశాన్ని ఏలే సత్తా సీఎం కేసీఆర్‌కు ఉన్నదని, ఆయన అపర మేధావి అని నర్సాపూర్‌ ఎమ్మెల్యే మదన్‌రెడ్డి పేర్కొన్నారు.

దేశాన్ని ఏలే సత్తా కేసీఆర్‌కు ఉంది: మదన్‌రెడ్డి

 నర్సాపూర్‌, అక్టోబరు 7: దేశాన్ని ఏలే సత్తా సీఎం కేసీఆర్‌కు ఉన్నదని, ఆయన అపర మేధావి అని నర్సాపూర్‌ ఎమ్మెల్యే మదన్‌రెడ్డి పేర్కొన్నారు. టీఆర్‌ఎ్‌సను బీఆర్‌ఎ్‌సగా మారుస్తూ జాతీయ పార్టీగా ప్రకటించిన సందర్భంగా శుక్రవారం నర్సాపూర్‌ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో సంబురాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొని మాట్లాడారు. దేశ రాజకీయాల్లో కీలకపాత్ర పోషించి భవిష్యత్తులో ప్రధానిగా కూడా చూస్తామని మదన్‌రెడ్డి జోష్యం చెప్పారు. కార్యక్రమంలో టీఆర్‌ఎస్‌ జిల్లా నాయకుడు, కౌన్సిలర్‌ అశోక్‌గౌడ్‌,  పీఏసీఎస్‌  చైర్మన్‌ రాజుయాదవ్‌, జడ్పీ కో ఆప్షన్‌ మెంబర్‌ మన్సూర్‌, మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌ నయీమొద్దీన్‌, మాజీ ఎంపీపీలు రమణారావు, శ్రీనివా్‌సగౌడ్‌, టీఆర్‌ఎస్‌ మండలాధ్యక్షుడు శేఖర్‌, పట్టణ అధ్యక్షులు భిక్షపతి, నాయకులు శ్రీధర్‌గుప్తా, జగదీష్‌, శ్రీశైలంయాదవ్‌, జ్ఞానేశ్వర్‌, ఆంజనేయులుగౌడ్‌, రామచందర్‌ తదితరులు పాల్గొన్నారు. 


 

Updated Date - 2022-10-08T04:23:10+05:30 IST