కస్తూర్బా విద్యార్థినికి అస్వస్థత

ABN , First Publish Date - 2022-07-07T06:03:56+05:30 IST

రామాయంపేట పట్టణంలోని కస్తూర్బా విద్యాలయంలో 8వ తరగతి చదువుతున్న బాలిక ఒక్క సారిగా అస్వస్థతకు గురైంది.

కస్తూర్బా విద్యార్థినికి అస్వస్థత

రామాయంపేట, జూలై 6: రామాయంపేట పట్టణంలోని కస్తూర్బా విద్యాలయంలో 8వ తరగతి చదువుతున్న బాలిక ఒక్క సారిగా అస్వస్థతకు గురైంది.  వివరాల్లోకి వెళ్తే.. మండల పరిధి దంతేపల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని బాపనయ్య తండాకు చెందిన నవీన అనే బాలిక కస్తూర్బా విద్యాలయంలో చదువుతున్నది. బుధవారం రాత్రి ఆమె అకస్మాత్తుగా కళ్లు తిరిగి కింద పడిపోగా, సిబ్బంది ఆమెను స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. కాగా కొన్ని రోజుల నుంచి గురుకుల పాఠశాలలో సరైన భోజనం వడ్డించని కారణంగా ఆమెతో పాటు మరికొంతమంది విద్యార్థులు తీవ్ర అసౌకర్యానికి గురవుతు న్నట్టు సమాచారం. కాగా ప్రస్తుతం బాధితురాలు ఆసుపత్రిలో కోలుకుంటోంది. 

Updated Date - 2022-07-07T06:03:56+05:30 IST