స్వయం ఉపాధితో భరోసా
ABN , First Publish Date - 2022-01-01T19:31:46+05:30 IST
స్వయం ఉపాధితో మహిళలకు భరోసా కల్పించేందుకు జిల్లా నెహ్రూ యువ కేంద్రం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కుట్టు మిషన్ శిక్షణ కేంద్రాన్ని సద్వినియోగం చేసుకోవాలని సర్పంచ్ కంఠారెడ్డి జనార్ధన్‌రెడ్డి సూచించారు.
మద్దూరు, డిసెంబరు 31: స్వయం ఉపాధితో మహిళలకు భరోసా కల్పించేందుకు జిల్లా నెహ్రూ యువ కేంద్రం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కుట్టు మిషన్ శిక్షణ కేంద్రాన్ని సద్వినియోగం చేసుకోవాలని సర్పంచ్ కంఠారెడ్డి జనార్ధన్‌రెడ్డి సూచించారు. శుక్రవారం మద్దూరులో వృత్తి విద్యపై ఉచిత కుట్టు మిషన్ శిక్షణ కార్యక్రమాన్ని ప్రారంభించారు. కార్యక్రమంలో జాతీయ యువజన వలంటీర్ చిలుక రమేష్, నర్సింహారెడ్డి, వార్డు సభ్యులు, యూత్ క్లబ్ సభ్యులు అశోక్, మహేందర్, శేఖర్, పవన్ పాల్గొన్నారు.