జూన్ 25ను బ్లాక్ డే గా ప్రకటించాలి
ABN , First Publish Date - 2022-06-26T05:07:03+05:30 IST
దేశంలో ఎమర్జెన్సీ విధించిన జూన్ 25ను బ్లాక్ డేగా ప్రకటించాలని దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్‌రావు డిమాండ్ చేశారు.

దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్‌రావు
సిద్దిపేట క్రైం, జూన్ 25: దేశంలో ఎమర్జెన్సీ విధించిన జూన్ 25ను బ్లాక్ డేగా ప్రకటించాలని దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్‌రావు డిమాండ్ చేశారు. శనివారం సిద్దిపేట జిల్లా కేంద్రంలోని బీజేపీ కార్యాలయంలో ఆయన విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. ఇందిరాగాంధీ ప్రధానిగా ఉన్న సమయంలో ప్రతిపక్షాలను అణచివేసినట్లుగానే ఇప్పుడు టీఆర్ఎస్ కూడా చేస్తుందని మండిపడ్డారు. ఇందిరాగాంధీ ప్రధానిగా ఉన్నప్పుడు జూన్ 25 రోజున ఎమర్జెన్సీ విధించారని, ఈరోజును ఎమర్జెన్సీ వ్యతిరేక దినోత్సవంగా జరుపుతున్నామని తెలిపారు. తెలంగాణలో ఎమర్జెన్సీ విధించేలా టీఆర్ఎస్ ప్రభుత్వ తీరు ఉన్నదని ఆరోపించారు. సమావేశంలో జిల్లా అధ్యక్షుడు శ్రీకాంత్‌రెడ్డి, సిద్దిపేట పట్టణ అధ్యక్షుడు శ్రీనివాస్, నాయకులు మల్లేశం, కొత్తపల్లి వేణు పాల్గొన్నారు.
గ్రామ గ్రామాన బీజేపీ జెండాలు ఎగురుతాయి
సిద్దిపేట రూరల్, జూన్ 25: రానున్న రోజుల్లో సిద్దిపేట నియోజకవర్గంలోని గ్రామ గ్రామాన బీజేపీ జెండాలు ఎగురుతాయని దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్‌రావు జోస్యం చెప్పారు. శనివారం సిద్దిపేట రూరల్ మండలంలోని రాఘవపూర్ గ్రామంతోపాటు మదిర గ్రామం బచ్చాయిపల్లిలో పార్టీ జెండాను ఎగురవేశారు. బచ్చాయిపల్లిలో ఏర్పాటు చేసిన సమావేశంలో టీఆర్ఎస్ నుంచి పలువురు నాయకులు బీజేపీ నాయకుడు దుర్గం రాజు ఆధ్వర్యంలో ఎమ్మెల్యే సమక్షంలో బీజేపీలో చేరారు. బచ్చాయిపల్లి గ్రామ రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు యాదగిరి, ఉపాధ్యక్షుడు యాదయ్య పదవులకు రాజీనామా చేసి బీజేపీలో చేరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రఘునందన్‌రావు మాట్లాడుతూ.. బీజేపీకి ప్రజల్లో పెరుగుతున్న ఆదరణను ఓర్వలేక టీఆర్ఎస్ పార్టీ బెదిరింపులకు, దాడులకు పాల్పడుతుందని ఆరోపించారు. యువకులు బెదిరింపులకు భయపడవద్దని, సంయమనం పాటించాలని సూచించారు. మంత్రి హరీశ్‌రావు బచ్చాయిపల్లిని గ్రామపంచాయతీగా ఎందుకు చేయలేదని, సీసీ రోడ్లు ఎందుకు వేయలేదని ప్రశ్నించారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు శ్రీకాంత్‌రెడ్డి, మండలాధ్యక్షుడు శ్రీనివా్‌సరెడ్డి, ప్రధాన కార్యదర్శి సురే్‌షగౌడ్, నాయకులు రమేష్, యాదగిరి, శ్రీనివాస్, రాజు, సింహాద్రి, దేవరాజు, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.