పారితోషికం ఇవ్వకుండా పనులు చేయించడం తగదు

ABN , First Publish Date - 2022-12-07T23:56:57+05:30 IST

జహీరాబాద్‌లోని డిప్యూటీ డీఎంహెచ్‌వో కార్యాలయం ఎదుట ఆశ వర్కర్ల ధర్నా

పారితోషికం ఇవ్వకుండా పనులు చేయించడం తగదు
జహీరాబాద్‌లో ధర్నా నిర్వహిస్తున్న ఆశ వర్కర్లు

జహీరాబాద్‌, డిసెంబరు 7: పారితోషికం ఇవ్వకుండా అదనపు పనులు చేయించుకోవడం సరైనది కాదంటూ బుధవారం జహీరాబాద్‌ పట్టణంలోని డిప్యూటీ డీఎంహెచ్‌వో కార్యాలయం ఎదుట నియోజకవర్గంలోని ఆశ వర్కర్లు సీఐటీయూ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సీఐటీయూ జిల్లా సహయ కార్యదర్శి మహిపాల్‌ మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం ఆశ వర్కర్ల చేత వెట్టిచాకిరి చేయించుకుంటున్నదని మండిపడ్డారు. పారితోషకం ఇవ్వకుండా ప్రతీ గ్రామంలో ఆశ వర్కర్లతో లెప్రోసీ సర్వే చేపిస్తున్నదన్నారు. ఆశ వర్కర్లకు రూ.10,000ల ఫిక్స్‌డ్‌ వేతనాలు అందజేయాలని, అదనపు పనికి అదనంగా పారితోషకం అందజేయాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో ఆశ వర్కర్స్‌ యూనియన్‌(సీఐటీయూ) క్లస్టర్‌ అధ్యక్షురాలు శశిరేఖ, నాయకులు సావిత్ర, లక్ష్మి, విజయలక్ష్మి, శ్యామల, ప్రవీన పాల్గొన్నారు.

Updated Date - 2022-12-07T23:56:58+05:30 IST