ఎన్నికలెప్పుడైనా బీజేపీ అధికారంలోకి రావడం ఖాయం

ABN , First Publish Date - 2022-09-22T05:16:39+05:30 IST

ఎన్నికలెప్పుడైనా బీజేపీ అధికారంలో రావడం ఖాయమని బీజేపీ జిల్లా అధ్యక్షుడు దూది శ్రీకాంత్‌రెడ్డి అన్నారు.

ఎన్నికలెప్పుడైనా బీజేపీ అధికారంలోకి రావడం ఖాయం
పార్టీలో చేరిన వారికి కండువా కప్పి ఆహ్వానిస్తున్న దూది శ్రీకాంత్‌రెడ్డి

బీజేపీ జిల్లా అధ్యక్షుడు దూది శ్రీకాంత్‌రెడ్డి

గజ్వేల్‌, సెప్టెంబరు 21: ఎన్నికలెప్పుడైనా బీజేపీ అధికారంలో రావడం ఖాయమని బీజేపీ జిల్లా అధ్యక్షుడు దూది శ్రీకాంత్‌రెడ్డి అన్నారు. గజ్వేల్‌-ప్రజ్ఞాపూర్‌ మునిసిపాలిటీ పరిధిలోని 6, 7వ వార్డులకు చెందిన ఆయా పార్టీల నాయకులు గజ్వేల్‌ పట్టణంలోని ఓ ఫంక్షన్‌హాల్‌లో శ్రీకాంత్‌రెడ్డి ఆధ్వర్యంలో బీజేపీలో చేరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గజ్వేల్‌లో బీజేపీ బలమైన శక్తిగా మారనున్నదని, త్వరలోనే బీజేపీలోకి భారీ చేరికలుంటాయన్నారు. బీజేపీ చేతిలో కేసీఆర్‌ గజ్వేల్‌లో, రాష్ట్రంలో ఓటమిని చవిచూస్తారని చెప్పారు. పార్టీలో చేరినవారిలో పెద్దపుల్ల రాజేశ్‌, నర్సింహా, కార్తీక్‌, వెంకటేష్‌, భైరాంబాబు, ప్రణదీప్‌, మహేష్‌, భానుప్రసాద్‌ ఉన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ సీనియర్‌ నాయకులు యెల్లు రాంరెడ్డి, పేర్ల శ్రీనివాస్‌ పాల్గొన్నారు. 

Read more