భరోసాలో ఉద్యోగాలకు దరఖాస్తుల ఆహ్వానం

ABN , First Publish Date - 2022-02-20T04:16:38+05:30 IST

సంగారెడ్డి జిల్లా పోలీసుల ఆధ్వర్యంలో మహిళలు, పిల్లల రక్షణ కోసం ఏర్పాటైన భరోసా కేంద్రంలో బాధిత మహిళలు, పిల్లలకు కౌన్సెలింగ్‌ ఇవ్వడానికి డాటా ఎంట్రీ ఆపరేటర్‌, ఏఎన్‌ఎం, లీగల్‌ సపోర్ట్‌ అధికారి కాంట్రాక్టు పోస్టులకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నామని జిల్లా ఎస్పీ ఎం.రమణకుమార్‌ ఒక ప్రకటనలో తెలిపారు.

భరోసాలో ఉద్యోగాలకు దరఖాస్తుల ఆహ్వానం

సంగారెడ్డి క్రైం, ఫిబ్రవరి 19: సంగారెడ్డి జిల్లా పోలీసుల ఆధ్వర్యంలో మహిళలు, పిల్లల రక్షణ కోసం ఏర్పాటైన భరోసా కేంద్రంలో బాధిత మహిళలు, పిల్లలకు కౌన్సెలింగ్‌ ఇవ్వడానికి డాటా ఎంట్రీ ఆపరేటర్‌, ఏఎన్‌ఎం, లీగల్‌ సపోర్ట్‌ అధికారి కాంట్రాక్టు పోస్టులకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నామని జిల్లా ఎస్పీ ఎం.రమణకుమార్‌ ఒక ప్రకటనలో తెలిపారు. కాంట్రాక్టు పద్దతి ఈ పోస్టులకు అర్హులైన వారు ఈనెల 21వ తేదీ సాయంత్రం 5 గంటల లోపు జిల్లా పోలీసు కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. మరిన్ని వివరాలకు 9440901847కు సంప్రదించాలని కోరారు. 

Read more