స్వాతంత్య్ర వేడుకలకు సర్వం సిద్ధం

ABN , First Publish Date - 2022-08-15T05:36:53+05:30 IST

సంగారెడ్డి, మెదక్‌ జిల్లాల్లో స్వాతంత్య్ర దినోత్సవానికి ఏర్పాట్లు పూర్తి చేశారు. సంగారెడ్డి జిల్లా కేంద్రంలో పోలీస్‌ పరేడ్‌గ్రౌండ్‌ను వేడుకలకు ముస్తాబు చేశారు. ఇక్కడ నేడు నిర్వహించనున్న ఉత్సవాలకు హోంశాఖ మంత్రి మహమూద్‌అలీ ముఖ్య అతిథిగా హాజరై జెండాను ఆవిష్కరిస్తారు. వేడుకల నిర్వహణ కోసం దేశభక్తిని చాటి చెప్పేలా ముస్తాబు చేశారు. ఆహుతుల కోసం శామియానాలు, సీట్లు ఏర్పాటు చేశారు. పట్టణంలోని ప్రధాన రహదారులతో పరేడ్‌గ్రౌండ్‌లో అడుగడుగునా జాగిలాలతో తనిఖీలు నిర్వహించారు.

స్వాతంత్య్ర వేడుకలకు  సర్వం సిద్ధం
సంగారెడ్డిలోని పోలీస్‌ పరేడ్‌గ్రౌండ్‌లో స్వాతంత్య్ర వేడుకల వేదిక పరిసరాలను జాగిలాలలో తనిఖీలు చేస్తున్న పోలీసులు

సంగారెడ్డిలో మహమూద్‌అలీ.. మెదక్‌లో తలసాని

జాతీయ జెండాను ఆవిష్కరించనున్న మంత్రులు


సంగారెడ్డి టౌన్‌/మెదక్‌ అర్బన్‌, ఆగస్టు 14 : సంగారెడ్డి, మెదక్‌ జిల్లాల్లో స్వాతంత్య్ర దినోత్సవానికి ఏర్పాట్లు పూర్తి చేశారు. సంగారెడ్డి జిల్లా కేంద్రంలో పోలీస్‌ పరేడ్‌గ్రౌండ్‌ను వేడుకలకు ముస్తాబు చేశారు. ఇక్కడ నేడు నిర్వహించనున్న ఉత్సవాలకు హోంశాఖ మంత్రి మహమూద్‌అలీ ముఖ్య అతిథిగా హాజరై జెండాను ఆవిష్కరిస్తారు. వేడుకల నిర్వహణ కోసం దేశభక్తిని చాటి చెప్పేలా ముస్తాబు చేశారు. ఆహుతుల కోసం శామియానాలు, సీట్లు ఏర్పాటు చేశారు. పట్టణంలోని ప్రధాన రహదారులతో పరేడ్‌గ్రౌండ్‌లో అడుగడుగునా జాగిలాలతో తనిఖీలు నిర్వహించారు. ఉదయం 10.30 గంటలకు హోంమంత్రి మహమూద్‌ అలీ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరించనున్నారు. జిల్లాలో అమలవుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలపై ప్రసంగించిన అనంతరం స్వాతంత్య్ర సమరయోధ్యుల కుటుంబీకులను సన్మానించనున్నారు. ఈ వేడుకల సందర్భంగా ఆయా శాఖల ద్వారా అమలవుతున్న ప్రభుత్వ పథకాలపై రూపొందించిన శకటాలను ప్రదర్శిస్తారు. అనంతరం స్థానిక విద్యా సంస్థల బాల, బాలికల చేత సాంస్కృతిక ప్రదర్శనలు, జిల్లాలో ఉత్తమ సేవలు అందించిన ఉద్యోగులకు ప్రశంసా పత్రాల పంపిణీతో పాటు స్టాళ్లను హోమంత్రితోపాటు కలెక్టర్‌ శరత్‌, జిల్లా ఎస్‌పీ రమణకుమార్‌, ప్రజాప్రతినిధులు, అధికారులు సందర్శించనున్నారు. 


మెదక్‌లో ముస్తాబైన కలెక్టరేట్‌

స్వాతంత్య్ర దినోత్సవానికి మెదక్‌ కలెక్టరేట్‌ ముస్తాబైంది. త్రివర్ణ పతాకంలోని రంగుల విద్యుత్‌ దీపాల అలంకరణలో కలెక్టరేట్‌ కాంతులీనుతున్నది. జిల్లాలోని ముఖ్య కార్యాలయాలు, భవనాలు విద్యుద్దీపాల కాంతులతో వెలిగిపోతున్నాయి. నేటి వేడుకలకు అధికార యంత్రాంగం ఏర్పాట్లు పూర్తిచేసింది. ఉదయం 10:30కు మంత్రి తలసాని శ్రీనివా్‌సయాదవ్‌ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించనున్నారు. అనంతరం కళాకారులు, విద్యార్థులు సాంస్కృతిక ప్రదర్శనలు నిర్వహించనున్నారు. పలు ప్రభుత్వ శాఖల ఆధ్వర్యంలో అభివృద్ధిని తెలిపే స్టాళ్లను ఏర్పాటు చేయనున్నారు.

Read more