తెలంగాణలో అనేక సంక్షేమ పథకాల అమలు

ABN , First Publish Date - 2022-10-08T04:23:43+05:30 IST

దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణలో అనేక సంక్షేమ పథకాలు అమలవుతున్నాయని నారాయణఖేడ్‌ ఎమ్మెల్యే భూపాల్‌రెడ్డి అన్నారు.

తెలంగాణలో అనేక సంక్షేమ పథకాల అమలు

  ఎమ్మెల్యే భూపాల్‌రెడ్డి 


పెద్దశంకరంపేట, అక్టోబరు 7: దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణలో అనేక సంక్షేమ పథకాలు అమలవుతున్నాయని నారాయణఖేడ్‌ ఎమ్మెల్యే భూపాల్‌రెడ్డి అన్నారు. పెద్దశంకరంపేట మండలం మల్కాపూర్‌ పరిధిలోని నూతన సేవాలాల్‌ తండాలో రూ.50 లక్షలతో చేపట్టిన అభివృద్ధి పనులకు శుక్రవారం ఆయన శంకుస్థాపన చేశారు. మిషన్‌భగీరథ ట్యాంకు, గిరిజన కమిటీ హాల్‌, గ్రావెల్‌ రోడ్డు పనులకు శంకుస్థాపన చేశారు. సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే అన్నారు. కార్యక్రమంలో జడ్పీటీసీ విజయరామరాజు, టీఆర్‌ఎస్‌ మండలాధ్యక్షుడు మురళిపంతులు, రైతుబంధు అధ్యక్షుడు సురే్‌షగౌడ్‌, మల్కాపూర్‌ సర్పంచు లక్ష్మణ్‌నాయక్‌, నాయకులు పున్నయ్య, అమర్‌ పాల్గొన్నారు.


మునుగోడుకు వెళ్లిన ఎమ్మెల్యే భూపాల్‌రెడ్డి 


నారాయణఖేడ్‌: మునుగోడు ఉప ఎన్నికలో టీఆర్‌ఎస్‌ తరఫున ప్రచారం చేసేందుకు ఎమ్మెల్యే భూపాల్‌రెడ్డి శుక్రవారం తరలివెళ్లారు. నేలపట్ల గ్రామానికి ఎమ్మెల్యేను ఇన్‌చార్జిగా నియమించారు. ఎమ్మెల్యే వెంట నారాయణఖేడ్‌ మండలాధ్యక్షుడు పరమేశ్వర్‌, మాజీ అధ్యక్షుడు ప్రభాకర్‌, రైతు సమన్వయ సమితి కో ఆర్డినేటర్‌ సత్యపాల్‌రెడ్డి, నాయకులు రవీందర్‌నాయక్‌, చెన్‌ బసప్ప, సీతారామరాజు, పెద్దశంకరంపేట ఎంపీపీ జంగం శ్రీనివాస్‌ వెళ్లారు.


 

Updated Date - 2022-10-08T04:23:43+05:30 IST