Siddipet: జాతీయ జెండా అవిష్కరించిన మంత్రి Harish Rao

ABN , First Publish Date - 2022-06-02T16:49:10+05:30 IST

సిద్దిపేట పోలీస్ పరేడ్ గ్రౌండ్‌లో మంత్రి హరీశ్ రావు జాతీయ జెండా అవిష్కరించారు.

Siddipet: జాతీయ జెండా అవిష్కరించిన మంత్రి Harish Rao

Siddipet: తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్బంగా సిద్దిపేట పోలీస్ పరేడ్ గ్రౌండ్‌లో మంత్రి హరీశ్ రావు (Harish Rao) జాతీయ జెండా అవిష్కరించారు. అనంతరం జిల్లా ప్రగతి నివేదిక చదివి వినిపించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ కేసీఆర్ (KCR) ఉద్యమ స్ఫూర్తి, అమరుల త్యాగ ఫలంతో తెలంగాణ సాధించుకున్నామన్నారు. గత ఎనిమిదేళ్లలో తెలంగాణ అభివృద్ధిలో దేశంలోనే నెంబర్ వన్ రాష్ట్రాంగా నిలిచిందన్నారు. వ్యవసాయ రంగంలో సీఎం కేసీఆర్ దార్శనికతతో దేశంలోనే అగ్రగామిగా నిలుస్తుందన్నారు. విద్యా, వైద్య ఆరోగ్య రంగాల్లో తెలంగాణ రాష్ట్రం గణనీయమైన మార్పు తీసుకొచ్చిందని, మిషన్ భగీరథ వంటి పథకాలు దేశానికి ఆదర్శంగా నిలుస్తున్నాయన్నారు. పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమాలతో పల్లెలు, పట్టణాల్లో అద్భుత ప్రగతి సాధిస్తున్నామని చెప్పారు. హరితహారం దేశానికే ఆదర్శమైందని, తెలంగాణ విద్యుత్ రంగంలో వచ్చిన మార్పు అద్భుతమన్నారు. దేశంలో అనేక రాష్ట్రాలు విద్యుత్ కొరతతో సతమతం అవుతుంటే, తెలంగాణలో వ్యవసాయానికి 24 గంటల ఉచిత విద్యుత్ అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని హరీశ్ రావు కొనియాడారు. ఈ కార్యక్రమంలో జడ్పిఛైర్ పర్సన్ రోజాశర్మ, సీపీ శ్వేత, అడిషనల్ కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-06-02T16:49:10+05:30 IST