గొల్ల, కురుమలను ఎస్టీ జాబితాలో చేర్చాలి

ABN , First Publish Date - 2022-10-08T04:24:30+05:30 IST

గొల్ల, కురుమలను ఎస్టీ జాబితాలో చేర్చాలని కోరుతూ తెలంగాణ గొర్రెల, మేకల పెంపకందారుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో శుక్రవారం హైదరాబాద్‌లో హరియాణా గవర్నర్‌ దత్రాత్రేయకు వినతిపత్రాన్ని అందజేశారు.

గొల్ల, కురుమలను ఎస్టీ జాబితాలో చేర్చాలి

  హరయాణా గవర్నర్‌ దత్రాత్రేయకు వినతి


సంగారెడ్డి అర్బన్‌, అక్టోబరు 7: గొల్ల, కురుమలను ఎస్టీ జాబితాలో చేర్చాలని కోరుతూ తెలంగాణ గొర్రెల, మేకల పెంపకందారుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో శుక్రవారం హైదరాబాద్‌లో హరియాణా గవర్నర్‌ దత్రాత్రేయకు వినతిపత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షుడు బాపుమల్‌శెట్టి మాట్లాడుతూ.. కురుమ కులస్థులు సంచార జాతుల వలే అడవుల్లో జీవనం సాగిస్తున్నారని చెప్పారు. కర్నాటకలో మాదిరిగా తెలంగాణలోనూ ఎస్టీ జాబితాలో చేర్చేలా చర్యలు తీసుకోవాలని కోరారు. వినతిపత్రాన్ని అందజేసిన వారిలో రాష్ట్ర ఉపాధ్యక్షుడు రాంచందర్‌, జిల్లా అధ్యక్షుడు మల్లేశం, ఉపాధ్యక్షుడు గోవింద్‌, మల్లేశం, కిష్టయ్య ఉన్నారు.


 

Updated Date - 2022-10-08T04:24:30+05:30 IST