చంద్రఘంటా అలంకరణలో దర్శనమిచ్చిన దుర్గామాత

ABN , First Publish Date - 2022-09-29T05:03:25+05:30 IST

శరన్నవరాత్రుల్లో భాగంగా బుధవారం ఏడుపాయల వనదుర్గామాత చంద్రఘంటా అలంకరణలో దర్శనమిచ్చారు.

చంద్రఘంటా అలంకరణలో దర్శనమిచ్చిన దుర్గామాత

  పాపన్నపేట,  సెప్టెంబరు 28: శరన్నవరాత్రుల్లో భాగంగా బుధవారం ఏడుపాయల వనదుర్గామాత చంద్రఘంటా అలంకరణలో దర్శనమిచ్చారు. ఉదయం 9:30 గంటలకు వేదబ్రాహ్మణులు అమ్మవారికి అభిషేకం చేసి అర్చన నిర్వహించారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం తీర్థ ప్రసాదాలు, భోజనం స్వీకరించారు. కార్యక్రమంలో పాలకవర్గ చైర్మన్‌ బాలాగౌడ్‌, ఈవో సారశ్రీనివాస్‌, డైరెక్టర్లు, ఆలయ సిబ్బంది, మహిళలు, భక్తు లు పాల్గొన్నారు. గురువారం ఏడుపాయల వనదుర్గామాత మహాలక్ష్మి అలంకరణలో భక్తులకు దర్శనమివ్వనున్నారు. 

Read more