రక్తదానంతో మరొకరికి ప్రాణ దానం

ABN , First Publish Date - 2022-08-18T05:10:16+05:30 IST

అన్ని దానాల కన్నా రక్తదానం గొప్పదని, మరొకరి ప్రాణాలు కాపాడేందుకు సంజీవనిలా ఉపయోగపడుతుందని ఎమ్మెల్యేలు గూడెం మహిపాల్‌రెడ్డి, భూపాల్‌రెడ్డి, మదన్‌రెడ్డి, మాణిక్‌రావు అన్నారు.

రక్తదానంతో మరొకరికి ప్రాణ దానం
నర్సాపూర్‌ ఆసుపత్రిలో రక్తదాన శిబిరంలో పాల్గొన్న ఎమ్మెల్యే, జిల్లా వైద్యాధికారి

వజ్రోత్సవ వేడుకల్లో రక్తదాన శిబిరం

ప్రారంభించిన ఎమ్మెల్యేలు

పటాన్‌చెరు/నారాయణఖేడ్‌/నర్సాపూర్‌/జహీరాబాద్‌/సంగారెడ్డి అర్బన్‌/కౌడిపల్లి, ఆగస్టు 17: అన్ని దానాల కన్నా రక్తదానం గొప్పదని, మరొకరి ప్రాణాలు కాపాడేందుకు సంజీవనిలా ఉపయోగపడుతుందని ఎమ్మెల్యేలు గూడెం మహిపాల్‌రెడ్డి, భూపాల్‌రెడ్డి, మదన్‌రెడ్డి, మాణిక్‌రావు అన్నారు. స్వాతంత్య్ర వజ్రోత్సవ వేడుకల్లో భాగంగా బుధవారం పటాన్‌చెరు ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో, ఖేడ్‌ ఏరియా వైద్యశాలలో, నర్సాపూర్‌ ఏరియా ఆసుపత్రిలో, జహీరాబాద్‌ ఏరియా ఆస్పత్రిలో ఎమ్మెల్యేల ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరం నిర్వహించారు. ఈ శిబిరంలో పలువురు నాయకులు, అధికారులు ప్రజాప్రతినిధులు పాల్గొని రక్తదానం చేశారు.  కాగా సంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా 574 యూనిట్ల రక్తాన్ని సేకరించినట్లు ఇన్‌చార్జి డీఎంహెచ్‌వో డాక్టర్‌ గాయత్రీదేవీ తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేలు మాట్లాడారు. రక్తదానంపై ఇంకా అపోహలు నెలకొని ఉన్నాయన్నారు. రక్తం దానం చేయడం వల్లే ఎలాంటి సమస్యలు తెలెత్తవని తెలుసుకోవాలన్నారు. రక్తంకు ప్రత్యామ్నాయం లేదన్నారు. మనం దానం చేసే రక్తం ఎందరో ప్రాణాలు నిలబెట్టే అమృతంలా పనిచేస్తుందన్నారు. ఈసందర్భంగా రక్తదాతలను వారు అభినందించి ధ్రువపత్రాలను అందజేశారు. పటాన్‌చెరులో కార్పోరేటర్‌ మెట్టుకుమార్‌యాదవ్‌, డీఎస్పీ భీంరెడ్డి, నారాయణఖేడ్‌లో  జిల్లా వ్యవసాయాధికారి నర్సింహారావు, జడ్పీటీసీ లక్ష్మీబాయిరవీందర్‌నాయక్‌, సీఐరామక్రిష్ణ, నర్సాపూర్‌లో జిల్లా వైద్యాధికారి డాక్టర్‌ వెంకటేశ్వర్లు, ఏఎంసీ చైర్‌పర్సన్‌ అనుసూయాఅశోక్‌గౌడ్‌, టీఆర్‌ఎస్‌ మండలాధ్యక్షుడు శేఖర్‌, గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ చంద్రాగౌడ్‌, జహీరాబాద్‌లో డీసీఎంఎస్‌ చైర్మన్‌ శివకుమార్‌, జిల్లా పరిషత్‌ సీఈవో ఎల్లయ్య, అత్మకమిటీ చైర్మన్‌ పెంటారెడ్డి పాల్గొన్నారు. కౌడిపల్లిలోని ప్రాథమిక ఆరోగ్యకేంద్రం అవరణలో పోలీసుశాఖ, జర్నలి్‌స్టలు, యువజన సంఘాలు అధ్వర్యంలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని డీఎంహెచ్‌వో వెంకటేశ్వర్లు, నర్సాపూర్‌ సీఐ శేఖ్‌లాల్‌ మదర్‌ రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు. కార్యక్రమంలో  ఎస్‌ఐ శివప్రసాద్‌రెడ్డి, ఎంపీడీవో భారతి, సర్పంచ్‌లు రాజేందర్‌, ఎల్లం, నర్సింగరావు , నరహరి, నాయకులు రామగౌడ్‌ ఉన్నారు. 

Read more