‘గౌరవెల్లి’ ట్రయల్‌ రన్‌ చేపట్టాలి

ABN , First Publish Date - 2022-06-30T05:43:07+05:30 IST

గౌరవెల్లి ప్రాజెక్టు ట్రయల్‌ రన్‌ చేపట్టి రైతులకు సాగునీరు అందించాలని టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు పెసరు సాంబరాజు కోరారు. అక్కన్నపేట మండల కేంద్రంలో ప్రాజెక్టు ట్రయల్‌ రన్‌ చేపట్టాలని చేస్తున్న రైతుల దీక్షలు బుధవారానికి 14వ రోజుకు చేరుకున్నాయి.

‘గౌరవెల్లి’ ట్రయల్‌ రన్‌ చేపట్టాలి
అక్కన్నపేటలో రైతులు నిర్వహిస్తున్న దీక్ష

అక్కన్నపేట, జూన్‌ 29 : గౌరవెల్లి ప్రాజెక్టు ట్రయల్‌ రన్‌ చేపట్టి రైతులకు సాగునీరు అందించాలని టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు పెసరు సాంబరాజు కోరారు. అక్కన్నపేట మండల కేంద్రంలో ప్రాజెక్టు ట్రయల్‌ రన్‌ చేపట్టాలని చేస్తున్న రైతుల దీక్షలు బుధవారానికి 14వ రోజుకు చేరుకున్నాయి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎమ్మెల్యే సతీ్‌షకుమార్‌ మెట్ట ప్రాంతమైన హుస్నాబాద్‌ నియోజకవర్గానికి గోదావరి జలాలను తీసుకువచ్చి సస్యశ్యామలం చేయాలని గౌరవెల్లి ప్రాజెక్టును పూర్తి చేసేందుకు కృషి చేస్తుంటే ప్రతిపక్షాలు అనవసరంగా రాద్ధాంతం చేస్తూ ప్రాజెక్టును అడ్డుకుంటున్నారని ఆరోపించారు. ఆరు నూరైనా జూలై మొదటి వారంలో ఎమ్మెల్యే సతీ్‌షకుమార్‌ ప్రాజెక్టు ట్రయల్‌ రన్‌ చేపడతారని తెలిపారు. ఈ దీక్షలో వైస్‌ ఎంపీపీ మజ్జిగ మొగిలి, రైతులు పాల్గొన్నారు.


Updated Date - 2022-06-30T05:43:07+05:30 IST