ఎస్సీ స్టడీ సర్కిల్‌లో ఉచిత శిక్షణ

ABN , First Publish Date - 2022-09-22T04:39:31+05:30 IST

తెలంగాణ ఎస్సీ స్టడీ సర్కిల్‌ సిద్దిపేటలో గ్రూప్‌ 1,2,3,4, ఆర్‌ఆర్‌బీ, ఎస్సెస్సీ, బ్యాంకింగ్‌ తదితర పోటీ పరీక్షలకు ఉచితంగా ఐదు నెలల పాటు ఫౌండేషన్‌ కోర్సు ద్వారా శిక్షణ ఇవ్వనున్నట్లు ఉమ్మడి జిల్లా టీఎస్‌ ఎస్సీ స్టడీ సర్కిల్‌ డైరెక్టర్‌ శ్రీకాంత్‌ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు.

ఎస్సీ స్టడీ సర్కిల్‌లో ఉచిత శిక్షణ

మెదక్‌, సెప్టెంబరు 21: తెలంగాణ ఎస్సీ స్టడీ సర్కిల్‌ సిద్దిపేటలో గ్రూప్‌ 1,2,3,4, ఆర్‌ఆర్‌బీ, ఎస్సెస్సీ, బ్యాంకింగ్‌ తదితర పోటీ పరీక్షలకు ఉచితంగా ఐదు నెలల పాటు ఫౌండేషన్‌ కోర్సు ద్వారా శిక్షణ ఇవ్వనున్నట్లు ఉమ్మడి జిల్లా టీఎస్‌ ఎస్సీ స్టడీ సర్కిల్‌ డైరెక్టర్‌ శ్రీకాంత్‌ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉమ్మడి మెదక్‌ జిల్లాకు చెందిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ విద్యార్థులు అర్హులని పేర్కొన్నారు. డిగ్రీ పూర్తి చేసిన వారు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని పేర్కొన్నారు. ఈనెల 10 నుంచి 24వ తేదీ వరకు ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తులను స్వీకరిస్తున్నట్లు తెలిపారు. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు అక్టోబరు 2న సిద్దిపేటలోని ప్రతిభ డిగ్రీ కళాశాలలో ఎంట్రెన్స్‌ టెస్టు నిర్వహించనున్నట్లు తెలిపారు. అభ్యర్థులకు ఉచిత భోజనం, హాస్టల్‌ సదుపాయం కల్పించనున్నట్లు పేర్కొన్నారు. మిగితా వివరాల కోసం టీఎ్‌స స్టడీ సర్కిల్‌ వెబ్‌ సైట్‌ లేదా 9182220112 నంబర్‌లో సంప్రదించాలని తెలిపారు. 

Read more