ప్రమాదానికి గురైన మాజీ ఎమ్మెల్సీ వాహనం
ABN , First Publish Date - 2022-10-08T04:37:35+05:30 IST
కుకునూరుపల్లి పోలీ్‌సస్టేషన్ పరిధిలోని కొడకండ్ల వద్ద బెల్లంపల్లి మాజీ ఎమ్మెల్సీ పురాణం సతీ్‌షకుమార్ వాహనం శుక్రవారం సాయంత్రం ప్రమాదానికి గురైంది.
కొండపాక, అక్టోబరు 7: కుకునూరుపల్లి పోలీ్‌సస్టేషన్ పరిధిలోని కొడకండ్ల వద్ద బెల్లంపల్లి మాజీ ఎమ్మెల్సీ పురాణం సతీ్‌షకుమార్ వాహనం శుక్రవారం సాయంత్రం ప్రమాదానికి గురైంది. హైదరాబాద్‌కు వెళ్తున్న క్రమంలో కొడకండ్ల వద్ద రాజీవ్‌రహదారిపై డీసీఎంను ఒక్కసారిగా మలుపు తీసుకోవడంతో వ్యాన్‌కు సతీ్‌షకుమార్ వెళ్తున్న వాహనం ఢీ కొట్టింది. దీంతో మాజీ ఎమ్మెల్సీ కారు ముందు భాగం ధ్వంసమైంది. అందులో వెళ్తున్న ఆయన కుటుంబసభ్యులకు ఎవరికి ఎలాంటి గాయాలు కాలేదు. సమాచారం తెలుసుకున్న కుకునూరుపల్లి పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని వాహనాలను పక్కకు తీశారు. అజాగ్రత్తగా వెళ్లిన డీసీఎం డ్రైవర్‌పై కేసు నమోదు చేశారు.