మంజీరాలో నీట మునిగి రైతు మృతి
ABN , First Publish Date - 2022-03-06T04:54:32+05:30 IST
మంజీరాలో నీట మునిగి ఓ రైతు మృతి చెందాడు.
కొల్చారం, మార్చి 5: మంజీరాలో నీట మునిగి ఓ రైతు మృతి చెందాడు. బంధువులు, కుటుంబీకులు తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని పైతర గ్రామానికి చెందిన చిత్తం మల్లేశం(34) తన పొలానికి నీరందించే మోటారు మరమ్మతు కోసం నది నుంచి బయటకు తీస్తుండగా ప్రమాదవశాత్తు కాలు జారి నదిలో పడి మృతి చెందాడు. మృతుడికి భార్య కిష్టమ్మ, ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. ఈ మేరకు శనివారం పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.