బొల్లారం పీహెచ్‌సీకి షరతులతో ‘ఎన్‌క్వా్‌స’

ABN , First Publish Date - 2022-12-31T23:11:09+05:30 IST

సంగారెడ్డి జిల్లాలోని బొల్లారం ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి షరతులతో కూడిన జాతీయ నాణ్యతా ప్రమాణాల (ఎన్‌క్యూఏఎ్‌స)గుర్తింపు దక్కింది.

బొల్లారం పీహెచ్‌సీకి షరతులతో ‘ఎన్‌క్వా్‌స’

91.83 స్కోర్‌తో జాతీయ నాణ్యతా ప్రమాణాల గుర్తింపు

సంగారెడ్డి అర్బన్‌, డిసెంబరు 31 : సంగారెడ్డి జిల్లాలోని బొల్లారం ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి షరతులతో కూడిన జాతీయ నాణ్యతా ప్రమాణాల (ఎన్‌క్యూఏఎ్‌స)గుర్తింపు దక్కింది. గత నెల 3, 4 తేదీల్లో ఎన్‌క్వా్‌స బృందం పీహెచ్‌సీని తనిఖీ చేసింది. ఆ క్రమంలో సర్వీస్‌ ప్రొవిజన్‌, పెషెంట్‌ రైట్స్‌, ఇన్‌ఫుట్స్‌, సపోర్టు సర్వీసెస్‌, క్లినికల్‌ సర్వీసెస్‌, ఇన్‌ఫెక్షన్‌ కంట్రోల్‌, క్వాలిటీ మేనేజ్‌మెంట్‌, ఔట్‌కమ్‌ ఇలా ఎనిమిది అంశాలను పరిశీలించి ఈ మేరకు ఫలితాలు వెలువరించింది. 91.83 మార్కుల స్కోర్‌ చేయగా షరతులతో జాతీయ నాణ్యతా ప్రమాణాలకు (ఎన్‌క్వాస్‌) ధ్రువీకరిస్తూ ఉత్తర్వులను జారీ చేసిందని జిల్లా క్వాలిటీ మేనేజర్‌ రవి చింతల తెలిపారు. దీంతో ఆ పీహెచ్‌సీకి యేటా నగదు ప్రోత్సాహం అందనుంది. అయితే షరతులతో గుర్తింపు వచ్చినందుకుగాను తిరిగి పూర్తి స్థాయిలో ఎన్‌క్వా్‌స గుర్తింపు కోసం వైద్యాఽధికారులు కసరత్తు చేయాల్సి ఉంటుంది.

Updated Date - 2022-12-31T23:11:10+05:30 IST