Medak: వైద్యఆరోగ్యశాఖ ఉద్యోగిని ఆత్మహత్యాయత్నం..

ABN , First Publish Date - 2022-12-13T14:42:36+05:30 IST

మెదక్: పనిభారంతో వైద్య ఆరోగ్యశాఖ ఉద్యోగిని ఆత్మహత్యాయత్నం (Suicide Attempt) చేసిన ఘటన మెదక్ (Medak) జిల్లాలో వెలుగుచూసింది.

Medak: వైద్యఆరోగ్యశాఖ ఉద్యోగిని ఆత్మహత్యాయత్నం..

మెదక్: పనిభారంతో వైద్య ఆరోగ్యశాఖ ఉద్యోగిని ఆత్మహత్యాయత్నం (Suicide Attempt) చేసిన ఘటన మెదక్ (Medak) జిల్లాలో వెలుగుచూసింది. కౌడిపల్లి మండలం, మహ్మద్‌నగర్ ఆరోగ్య ఉపకేంద్రంలో పనిచేస్తున్న ఉద్యోగిని రాజమణి ఆత్మహత్యాయత్నా

నికి పాల్పడింది. దీనికి సంబంధించిన ఆడియో (Audio) సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. 20 ఏళ్లుగా కాంట్రాక్టు పద్ధతిలో రాజమణి ఏఎన్ఎం (ANM)గా విధులు నిర్వహిస్తున్నారు. రెండో ఏఎన్ఎం లేక పనిబారమంతా తనపైనే పడిందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. తనకు రెండో ఏఎన్ఎం ఇవ్వాలని పలుమార్లు అధికారులకు విన్నవించినా పట్టించుకోలేదని అన్నారు. అంతేగాకుండా పని సరిగా చేయడంలేదని జీతం నిలిపివేస్తామని చెప్పారని ఆమె కన్నీటిపర్యంతమయ్యారు. అంతకుముందునుంచే తీవ్ర మానసిక ఒత్తిడిని ఎదుర్కొంటున్నానని నిబద్దతతో పనిచేస్తున్నా.. తనకు గుర్తింపులేకుండా పోయిందని వాపోయారు. తనకు చావే పరిష్కారమని ఆత్మహత్య చేసుకుంటున్నానంటూ ఆడియో విడుదల చేశారు. కారకుల పేర్లను లేఖలో రాస్తానని రికార్డులో ఉంది.

రాజమణి ఆత్మహత్యాయత్నం చేయగా కుటుంబసభ్యులు గుర్తించారు. ప్రస్తుతం ఆమె హైదరాబాద్‌లోని ఓ ప్రవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్లు సమాచారం. సదరు ఆడియో రికార్డు మూడు రోజుల క్రితం పీఎస్సీ గ్రూపులో పోస్టు చేసినట్లు తోటి ఉద్యోగులు చెబుతున్నారు.

Updated Date - 2022-12-13T14:42:40+05:30 IST