విద్యారంగ సమస్యలను పరిష్కరించాలి
ABN , First Publish Date - 2022-12-22T23:18:39+05:30 IST
ఏబీవీపీ నాయకుల డిమాండ్, నిరసనలు
మెదక్ అర్బన్/నర్సాపూర్/నారాయణఖేడ్, డిసెంబరు 22: పెండింగ్‌లో ఉన్న విద్యారంగ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ గురువారం ఏబీవీపీ ఆధ్వర్యంలో నిరసనలు నిర్వహించారు. సీఎం కేసీఆర్ అధికారం చేపట్టి తొమ్మిదేళ్ల గడుస్తున్నా విద్యారంగ సమస్యలను పరిష్కరించడంలో విఫలమయ్యారన్నారు. ఫీజు రీయింబర్స్‌మెంట్ విడుదల చేయకపోవడంతో అనేక మంది పేద విద్యార్థులు చదువులకు దూరం అవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. యూనివర్సీటీలలో టీచింగ్ పోస్టులు భర్తీ కాక.. తరగతులు జరగక విద్యాబోధన కుంటుపడుతుందన్నారు. మెదక్‌లో రాందాస్ చౌరస్తాలో నాయకులు రాస్తారోకోకు దిగారు. అనంతరం సీఎం కేసీఆర్ దిష్టిబొమ్మను దహనం చేశారు. కార్యక్రమంలో మెదక్ విభాగ్ కన్వీనర్ శ్రీనివా్‌సగౌడ్, నగర కార్యదర్శి భానుప్రసాద్, నాయకులు ఉదయ్, రంజిత్, సాయికిరణ్, వరప్రసాద్, దుర్గ, విజయలక్ష్మి, శివలక్ష్మి, అనిల్ పాల్గొన్నారు. నర్సాపూర్‌లో నిర్వహించిన కార్యక్రమంలో ఏబీవీపీ జిల్లా కన్వీనర్ శశాంక్, నాయకులు రాహుల్, అక్షయ్, సుజిత్ పాల్గొన్నారు. నారాయణఖేడ్‌లో తహసీల్ కార్యాలయం నుంచి బసవేశ్వర చౌక్ వరకు ర్యాలీ నిర్వహించి, మానవహారం నిర్వహించారు. ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేశారు. కార్యక్రమంలో ఏబీవీపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ఆకాష్, పట్టణ కార్యదర్శి పవన్‌రెడ్డి, చత్రపతి జోనల్ ఇన్‌చార్జి అమూల్‌రావు, నాయకులు ప్రవీణ్, రాజు, శివాజీ, శశికాంత్, అశోక్, నాగరాజు, బన్నీ, తరుణ్, విష్ణువర్ధన్‌రెడ్డి, శంకర్, జీవన్, విగ్నేష్, నాని పాల్గొన్నారు.