బిలాల్‌పూర్‌లో స్వల్ప భూకంపం
ABN , First Publish Date - 2022-12-07T00:25:33+05:30 IST
సంగారెడ్డి జిల్లా కోహీర్ మండలంలోని బిలాల్‌పూర్ గ్రామంలో మంగళవారం తెల్లవారుజామున 3.23 గంటలకు కొన్ని సెకన్ల పాటు భూమి కంపించింది.
మంగళవారం తెల్లవారుజామున 3.23కు కంపించిన భూమి
రిక్టర్ స్కేల్‌పై 3.6గా నమోదైన తీవ్రత
సరిగ్గా ఏడాది క్రితం కూడా గ్రామంలో భూకంపం
జహీరాబాద్, డిసెంబరు 6: సంగారెడ్డి జిల్లా కోహీర్ మండలంలోని బిలాల్‌పూర్ గ్రామంలో మంగళవారం తెల్లవారుజామున 3.23 గంటలకు కొన్ని సెకన్ల పాటు భూమి కంపించింది. రిక్టర్ స్కేల్‌పై దీని తీవ్రత 3.6గా నమోదైంది. పెద్దశబ్దంతో భూమి కంపించడంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. కోహీర్, మనియార్‌పల్లి, సజ్జాపూర్‌తో పాటు వికారాబాద్ జిల్లాలోని మర్పల్లి, దామస్తపూర్, బుచన్‌పల్లి, తోర్‌మామిడి గ్రామాల్లో కూడా స్వల్పంగా భూమి కంపించినట్టు ఆయా గ్రామాల ప్రజలు తెలిపారు. భూకంప ప్రభావం బిలాల్‌పూర్ నుంచి 14 కిలోమీటర్ల మేర విస్తరించినట్టు నేషనల్ సెంటర్‌ఫర్ సిస్మాలజీ తన వెబ్‌సైట్‌లో పేర్కొన్నది. గతేడాది కూడా డిసెంబర్ 5వ తేదీన మధ్యాహ్నం 12.38 గంటలకు బిలాల్‌పూర్‌లో భూమి కంపించింది. సరిగ్గా ఏడాది తరువాత మరోసారి భూకంపం సంభవించడంపై గ్రామస్థులు ఆశ్చర్యం వ్యక్తం చేశారు.