రుతు ప్రేమపై ప్రతీ ఒక్కరు వంద మందికి అవగాహన కల్పించాలి

ABN , First Publish Date - 2022-12-16T23:53:41+05:30 IST

మహిళలు ఆరోగ్యంగా ఉండేలా మంత్రి హరీశ్‌రావు తన సొంత నిధులతో చేపట్టిన రుతుప్రేమ గురించి ప్రతి ఒక్కరూ 100 మందికి అవగాహన కల్పించాలని జడ్పీచైర్‌పర్సన్‌ రోజాశర్మ పేర్కొన్నారు.

రుతు ప్రేమపై ప్రతీ ఒక్కరు వంద మందికి అవగాహన కల్పించాలి
సమావేశంలో మాట్లాడుతున్న జడ్పీచైర్‌పర్సన్‌ రోజారాధాకృష్ణశర్మ

జడ్పీచైర్‌పర్సన్‌ రోజాశర్మ

సిద్దిపేట అగ్రికల్చర్‌, డిసెంబరు 16 : మహిళలు ఆరోగ్యంగా ఉండేలా మంత్రి హరీశ్‌రావు తన సొంత నిధులతో చేపట్టిన రుతుప్రేమ గురించి ప్రతి ఒక్కరూ 100 మందికి అవగాహన కల్పించాలని జడ్పీచైర్‌పర్సన్‌ రోజాశర్మ పేర్కొన్నారు. శుక్రవారం జిల్లా కలెక్టరేట్‌ కార్యాలయ సముదాయంలో రుతుప్రేమ కార్యక్రమంపై కార్యాలయ మహిళా సిబ్బంది, జిల్లా సమాఖ్య సిబ్బంది, మెప్మా ఆర్పీలకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ముఖ్యఅతిథులుగా జడ్పీచైర్‌పర్సన్‌ రోజాశర్మ, అదనపు కలెక్టర్‌ ముజామిల్‌ఖాన్‌, సీపీ శ్వేత హాజరయ్యారు. ముందుగా బెంగుళూరు నుంచి గైనకాలజిస్ట్‌ డాక్టర్‌ శాంతి వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా రుతుప్రేమలో భాగంగా రుతుచక్ర సమయంలో మహిళలు చేయాల్సిన పనులు గురించి, మెడికల్‌ గ్రేడ్‌ సిలిక్‌పను వాడే విధానం గురించి వివరించారు. ఈ సందర్భంగా జడ్పీచైర్‌పర్సన్‌ రోజాశర్మ మాట్లాడుతూ రుతుప్రేమలో గ్లోబల్‌ ప్రచారంగా తీర్చిదిద్దేలా మన సిద్దిపేట జిల్లాను నిలపడంలో మంత్రి హరీశ్‌రావు కృషి వెలకట్టలేనిదన్నారు. కార్యక్రమంలో డీఆర్డీఏ పీడీ గోపాల్‌రావు, జిల్లా బీసీ సంక్షేమ శాఖ అధికారి సరోజ, డీపీవో దేవకిదేవి, సెట్విన్‌ మేనేజర్‌ అమీనాబేగం, జిల్లా మహిళ సమాఖ్య అధ్యక్షురాలు స్వాతి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-12-16T23:53:42+05:30 IST