క్రమశిక్షణతో విధులు నిర్వర్తించాలి

ABN , First Publish Date - 2022-10-02T05:04:54+05:30 IST

పోలీసులు మంచి జీవన విధానాన్ని అవలంభించాలని, క్రమశిక్షణతో విధులు నిర్వర్తించి, జిల్లాకు, తెలంగాణ పోలీస్‌ శాఖకు మంచి పేరు తీసుకురావాలని పోలీస్‌ కమిషనర్‌ శ్వేత సూచించారు.

క్రమశిక్షణతో విధులు నిర్వర్తించాలి
గౌరవ వందనం స్వీకరిస్తున్న పోలీసు కమిషనర్‌ శ్వేత

పోలీస్‌ కమిషనర్‌ శ్వేత

చిన్నకోడూరు, అక్టోబరు 1: పోలీసులు మంచి జీవన విధానాన్ని అవలంభించాలని, క్రమశిక్షణతో విధులు నిర్వర్తించి, జిల్లాకు, తెలంగాణ పోలీస్‌ శాఖకు మంచి పేరు తీసుకురావాలని పోలీస్‌ కమిషనర్‌ శ్వేత సూచించారు. చిన్నకోడూరు మండలం పెద్దకోడూరు గ్రామ శివారులో ఉన్న సీఏఆర్‌ హెడ్‌క్వార్టర్‌లో జిల్లాలోని సివిల్‌, ఆర్మూడ్‌ రిజర్వ్‌ పోలీసు, హోంగార్డు సిబ్బందికి నిర్వహిస్తున్న వీక్లీ పరేడ్‌కు శనివారం ఆమె హాజరయ్యారు. పోలీసుల గౌరవ వందనం స్వీకరించి, అధికారులు, సిబ్బంది ప్రదర్శించిన ఆర్మ్స్‌, స్క్వాడ్‌, లాఠీ డ్రిల్‌ ప్రదర్శనను, నీట్‌ డ్రెస్‌ అవుట్‌ను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. పోలీస్‌ శాఖ ప్రతిష్ఠకు భంగం కల్గించే విధంగా ప్రవర్తించరాదని సూచించారు. ధర్నాలు, రాస్తోరోకోలు జరిగేటప్పుడు సిబ్బంది తీసుకోవాల్సిన ముందు జాగ్రత్తల గూర్చి శిక్షణ అందించాలని ఏఆర్‌ అడిషనల్‌ డీసీపీలకు ఆమె సూచించారు. ఈ కార్యక్రమంలో అడిషనల్‌ డీసీపీ అడ్మిన్‌ మహేందర్‌, ఏఆర్‌ అడిషనల్‌ డీసీపీ సుభాష్‌ చంద్రబోస్‌, ఎస్బీ ఏసీపీ రవీందర్‌రాజు, రిజర్వ్‌ ఇన్‌స్పెక్టర్లు రాజశేఖర్‌రెడ్డి, ధరణికుమార్‌, రామకృష్ణ, వన్‌టౌన్‌ సీఐ భిక్షపతి, టూటౌన్‌ సీఐ రవికుమార్‌, త్రీ టౌన్‌ సీఐ భానుప్రకాష్‌, రూరల్‌ సీఐ జానకి రాంరెడ్డి, సీసీ ఆర్బీ ఇన్‌స్పెక్టర్‌ సైదా నాయక్‌, మహిళా ఆర్‌ఎ్‌సఐ పుష్ప, ఎస్‌ఐలు, ఆర్‌ఎ్‌సఐలు, అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Read more