రక్తదానం చేసి ప్రాణదాతలు కావాలి

ABN , First Publish Date - 2022-08-18T04:32:45+05:30 IST

రక్తదానం చేసి ప్రాణదాతలు కావాలని హుస్నాబాద్‌ మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ ఆకుల రజిత అన్నారు. స్వతంత్ర భారత వజ్రోత్సవాల సందర్భంగా హుస్నాబాద్‌ ప్రభుత్వ ఆస్పత్రిలో బుధవారం రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు.

రక్తదానం చేసి ప్రాణదాతలు కావాలి
చేర్యాలలో రక్తదానం చేస్తున్న కొమురవెల్లి జడ్పీటీసీ సిద్ధప్పకు ప్రశంసాపత్రం అందజేస్తున్న ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి

హుస్నాబాద్‌ మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ ఆకుల రజిత

స్వతంత్ర భారత వజ్రోత్సవాల సందర్భంగా  రక్తదాన శిబిరాల ఏర్పాటు

హుస్నాబాద్‌, ఆగస్టు 17: రక్తదానం చేసి ప్రాణదాతలు కావాలని హుస్నాబాద్‌ మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ ఆకుల రజిత అన్నారు. స్వతంత్ర భారత వజ్రోత్సవాల సందర్భంగా హుస్నాబాద్‌ ప్రభుత్వ ఆస్పత్రిలో బుధవారం రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. ఇందులో నియోజకవర్గానికి చెందిన 75 మంది యువకులు రక్తదానం చేశారు. రక్తదానం చేసిన యువకులకు ప్రశంసా పత్రాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆర్డీవో జయచంద్రారెడ్డి, ఏసీపీ సతీష్‌, ఎంపీపీ మానస, లక్ష్మి, వైస్‌ చైర్‌పర్సన్‌ అయిలేని అనిత, తహసీల్దార్‌ మహేష్‌, కమిషనర్‌ రాజమల్లయ్య, ఆస్పత్రి సూపరింటెండెంట్‌ రమే్‌షరెడ్డి, మాజీ ఎంపీపీ ఆకుల వెంకట్‌, మాజీ మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ తిరుపతిరెడ్డి, కౌన్సిలర్‌ నళినిదేవి, టీఆర్‌ఎ్‌సవీ రాష్ట్ర నాయకులు పరశురాం, గోపాల్‌రెడ్డి, శంకర్‌రెడ్డి పాల్గొన్నారు. 

చేర్యాల: స్వతంత్ర భారత వజ్రోత్సవాలను పురస్కరించుకుని జనగామ జిల్లా కేంద్రంలో నిర్వహించిన రక్తదాన శిబిరంలో చేర్యాల, కొమురవెల్లి మండలాలకు చెందిన ప్రజాప్రతినిధులు, టీఆర్‌ఎస్‌ నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కొమురవెల్లి జడ్పీటీసీ సిలివేరు సిద్ధప్ప, ఎంపీపీ తలారి కీర్తన, రైతు సమన్వయ సమితి జిల్లా డైరెక్టర్‌ అంకుగారి శ్రీధర్‌రెడ్డి, చేర్యాల ఎంపీపీ వుల్లంపల్లి కరుణాకర్‌, పార్టీ మండలాధ్యక్షుడు అనంతుల మల్లేశం, సోషల్‌ మీడియా ఇన్‌చార్జి తాటికొండ సదానందం, టీఆర్‌ఎస్వీ రాష్ట్ర కార్యదర్శి జింకల పర్వతాలు, నాయకులు రక్తదానం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి ప్రశంసాపత్రం అందించి అభినందించారు.

దుబ్బాక: దుబ్బాక ప్రభుత్వ ప్రాంతీయ ఆస్పత్రిలో టీఆర్‌ఎస్‌ ప్రజాప్రతినిధులు ఉచిత రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. ఈ శిబిరాన్ని మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ వనిత, ఎంపీపీ పుష్పలత, జడ్పీటీసీ రవీందర్‌రెడ్డి, పీఏసీఎస్‌ చైర్మన్‌ కైలాస్‌, ఆస్పత్రి సూపరింటెండెంట్‌ హేమరాజ్‌సింగ్‌, సీఐ కృష్ణ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు, సర్పంచులు, ఎంపీటీసీలు, టీఆర్‌ఎస్‌ నాయకులు తదితరులున్నారు. 

చౌదరిపల్లిలో ముగ్గుల పోటీలు

వర్గల్‌, ఆగస్టు 17: స్వతంత్ర భారత వజ్రోత్సవాల సందర్భంగా వర్గల్‌ మండలం చౌదరిపల్లిలో బుధవారం గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు నిర్వహించారు. ముగ్గులపై జాతీయ జెండా ఉండాలనే విధంగా ఆంక్షలు విధించి ముగ్గుల పోటీలు నిర్వహించారు. ఈ పోటీల్లో విజేతలైన మహిళలకు ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్‌ బోడిగే లలితాశంకర్‌గౌడ్‌, ఉపసర్పంచ్‌ పొద్దటూరి శ్రీనివాస్‌, అధికారులు, వార్డుమెంబర్లు పాల్గొన్నారు. 

Updated Date - 2022-08-18T04:32:45+05:30 IST