పలు మండలాల్లో దొడ్డి కొమురయ్య వర్ధంతి

ABN , First Publish Date - 2022-07-05T05:59:45+05:30 IST

తెలంగాణ సాయుధ పోరాట వీరుడు దొడ్డి కొమురయ్య 76వ వర్ధంతిని ఉమ్మడి పుల్కల్‌ మండలంలో సోమవారం ఘనంగా నిర్వహించారు.

పలు మండలాల్లో దొడ్డి కొమురయ్య వర్ధంతి
పుల్కల్‌ తహసీల్దారు కార్యాలయంలో నివాళులర్పిస్తున్న తహసీల్దార్‌

పుల్‌కల్‌/హత్నూర/నారాయణఖేడ్‌,, జూలై 4: తెలంగాణ సాయుధ పోరాట వీరుడు దొడ్డి కొమురయ్య 76వ వర్ధంతిని ఉమ్మడి పుల్కల్‌ మండలంలో సోమవారం ఘనంగా నిర్వహించారు. మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన గొల్మ కుర్మలు కొమురయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. మండలంలోని చక్రియాల్‌లో కుర్మ సంఘం అధ్యక్షుడు చిన్నరోళ్లపాటి రాజశేఖర్‌, మండల కేంద్రాలైన చౌటకూర్‌, పుల్కల్‌లో రాష్ట్ర సర్పంచుల ఐక్య వేదిక వ్యవస్థాపక అధ్యక్షుడు అందోల్‌ క్రిష్ణ అధ్వర్యంలో గొల్మకుర్మలు దొడ్మి కొమురయ్యకు ఘనంగా నివాళులర్పించారు. కార్యక్రమంలో టీఆర్‌ఎస్‌ మండలాధ్యక్షుడు చౌకంపల్లి శివకుమార్‌, నాయకులు  పాల్గొన్నారు. అదేవిధంగా హత్నూర మండలం దౌల్తాబాద్‌లో దొడ్డి కొమురయ్య వర్ధంతిని ఘనంగా నిర్వహించారు. దౌల్తాబాద్‌లోని తెలంగాణ తల్లి విగ్రహం వద్ద ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. కార్యక్రమంలో ఆయా పార్టీల నాయకులు పాల్గొన్నారు. నారాయణఖేడ్‌లో కురుమ యువత ఆధ్వర్యంలో సోమవారం దొడ్డి కొమురయ్య వర్ధంతిని ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో కురుమ యువత బాధ్యులు లొందె. నర్సింహులు, మల్గొండ, ప్రభాకర్‌, నవనాథ్‌, జైపాల్‌, బీమన్న, వెంకట్‌, దశరత్‌, తదితరులు పాల్గొన్నారు. కాగా అంతకుముందు ఎమ్మెల్యే భూపాల్‌రెడ్డి కూడా కొమురయ్య విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. 

Read more