సహేతుక కారణం లేకుండా ధరణి దరఖాస్తులను తిరస్కరించొద్దు

ABN , First Publish Date - 2022-03-06T05:15:03+05:30 IST

సహేతుక కారణం లేకుండా ధరణిలో దరఖాస్తులను తిరస్కరించొద్దని రెవెన్యూ అధికారులకు సిద్దిపేట జిల్లా కలెక్టర్‌ హన్మంతరావు సూచించారు. గజ్వేల్‌ పట్టణంలోని ఆర్డీవో కార్యాలయం నుంచి జిల్లా అధికారులతో ధరణి సమస్యలపై టెలీకాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ధరణి పోర్టల్‌లో భూసమస్యల పరిష్కారం కోరుతూ వచ్చిన అన్ని దరఖాస్తులను నిశితంగా పరిశీలించి చిన్న తప్పు కూడా దొర్లకుండా త్వరితగతిన పరిష్కరించాలన్నారు.

సహేతుక కారణం లేకుండా ధరణి దరఖాస్తులను తిరస్కరించొద్దు

త్వరితగతిన పరిష్కరించేందుకు చొరవ చూపాలి : కలెక్టర్‌ హన్మంతరావు


గజ్వేల్‌, మార్చి 5 : సహేతుక కారణం లేకుండా ధరణిలో దరఖాస్తులను తిరస్కరించొద్దని రెవెన్యూ అధికారులకు సిద్దిపేట జిల్లా కలెక్టర్‌ హన్మంతరావు సూచించారు. గజ్వేల్‌ పట్టణంలోని ఆర్డీవో కార్యాలయం నుంచి జిల్లా అధికారులతో ధరణి సమస్యలపై టెలీకాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ధరణి పోర్టల్‌లో భూసమస్యల పరిష్కారం కోరుతూ వచ్చిన అన్ని దరఖాస్తులను నిశితంగా పరిశీలించి చిన్న తప్పు కూడా దొర్లకుండా త్వరితగతిన పరిష్కరించాలన్నారు. నిషేధిత జాబితాలో చేరిన పట్టా భూములు తొలగింపు, మ్యుటేషన్‌, ఆస్తి హక్కు మార్పిడి కోసం భూయజమానులు మీసేవలో చేసుకున్న దరఖాస్తులను క్షుణ్ణంగా పరిశీలించాలన్నారు.ధరణిలో తిరస్కరించి, ఆమోదించిన దరఖాస్తుల జాబితాను సంబంధిత డాక్యుమెంట్‌లతో సహా వేరువేరుగా సిద్ధం చేసి, వచ్చే బుధవారం సాయంత్రంలోగా తనకు అందించాలన్నారు. పరిష్కార ప్రగతిపై ఆర్డీవోలు పర్యవేక్షించాలని, ధరణి దరఖాస్తుల పరిష్కారంలో నిర్లక్ష్యం వహి స్తే చర్యలు తప్పవని కలెక్టర్‌ హెచ్చరించారు. 


దళితబంధు నిధులకు కొరత లేదు

దళితబంధు పథకం అమలుకు నిధులు కొరత లేదని, నియోజకవర్గస్థాయిలో ఆర్డీవోలు ప్రత్యేకాధికారులుగా పర్యవేక్షణ బాధ్యతలు చూస్తున్నందున లబ్ధిదారులకు యూనిట్‌ల గ్రౌండింగ్‌ సాధ్యమైనంత త్వరగా జరిగేలా సమన్వయం చేసుకోవాలన్నారు. ‘మన బడి-మన ఊరు’ కార్యక్రమంకోసం మొదటి దశలో ఎంపిక చేసిన పాఠశాలల్లో పనులు చేపట్టేందుకు నిధులు పుష్కలంగా ఉన్నాయన్నారు. మౌలిక సదుపాయాల కల్పనకు పంచాయతీరాజ్‌ ఇంజనీరింగ్‌ విభాగం అంచనాలను సిద్ధం చేస్తుందని, రెవెన్యూ అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించాలన్నారు. పోస్టు మెట్రిక్‌ స్కాలర్‌షిప్‌ దరఖాస్తులకు సంబంధించి నోడల్‌ అధికారులుగా ఉన్న రెవెన్యూ అధికారులు వందశాతం విద్యార్థులకు స్కాలర్‌షిప్‌లు అందేలా చొరవ చూపాలన్నారు. ఈ టెలీకాన్ఫరెన్స్‌లో అదనపు కలెక్టర్‌ శ్రీనివాస్‌రెడ్డి, ఆర్డీవో విజయేందర్‌రెడ్డి, అనంతరెడ్డి, జయచంద్రారెడ్డి, జిల్లాలోని అన్ని మండలాల తహసీల్దార్లు ఉన్నారు.

Updated Date - 2022-03-06T05:15:03+05:30 IST