పట్నాల టికెట్ల ధరలు పెంచొద్దు

ABN , First Publish Date - 2022-03-06T05:08:02+05:30 IST

మల్లన్న దర్శనార్థం వచ్చే భక్తులపై భారం మోపుతూ పట్నాల టికెట్ల ధరలను పెంచకూడదని, కమీషన్లకు కక్కుర్తిపడి అడ్డదారిన పెంచాలని చూస్తే సహించబోమని బీజేపీ సిద్దిపేట జిల్లా ప్రధాన కార్యదర్శి బూరుగు సురేశ్‌ అన్నారు.

పట్నాల టికెట్ల ధరలు పెంచొద్దు

బీజేపీ సిద్దిపేట జిల్లా ప్రధాన కార్యదర్శి సురేశ్‌

చేర్యాల, మార్చి 5 : మల్లన్న దర్శనార్థం వచ్చే భక్తులపై భారం మోపుతూ పట్నాల టికెట్ల ధరలను పెంచకూడదని, కమీషన్లకు కక్కుర్తిపడి అడ్డదారిన పెంచాలని చూస్తే సహించబోమని బీజేపీ సిద్దిపేట జిల్లా ప్రధాన కార్యదర్శి బూరుగు సురేశ్‌ అన్నారు. శనివారం మల్లన్న ఆలయాన్ని సందర్శించి అఽధికారులకు వినతిపత్రం అందజేసి మాట్లాడారు. మల్లన్న దర్శనం కోసం వచ్చిన భక్తులకు కనీస వసతులు కల్పించకపోగా, పలురకాల దోపిడీకి గురవుతున్నా పట్టించుకోని అధికారులు పట్నాల టికెట్ల ధరల పెంపునకు చర్యలు తీసుకుంటుండటం తగదన్నారు. వెంటనే పెంపు ఆలోచనను విరమించుకోవాలని, లేనియెడల ఆందోళనలు చేపడతామన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ మండలాధ్యక్షుడు వెంకట్‌రెడ్డి, నాయకులు శ్రీనివాస్‌, కర్ణాకర్‌, తిరుపతి, మహేశ్‌ పాల్గొన్నారు.

Read more