కేసీఆర్‌ కిట్‌ల పంపిణీ వంద శాతం పూర్తి

ABN , First Publish Date - 2022-12-07T23:54:48+05:30 IST

సమీక్షా సమావేశంలో జిల్లా వైద్యాధికారి చందునాయక్‌

కేసీఆర్‌ కిట్‌ల పంపిణీ వంద శాతం పూర్తి
మనోహరాబాద్‌లో నూతన పీహెచ్‌సీ స్థలాన్ని పరిశీలిస్తున్న జిల్లా వైద్యాధికారి చందు నాయక్‌

తూప్రాన్‌, డిసెంబరు 7: కేసీఆర్‌ కిట్‌ల పంపిణీ, ఏఎన్‌సీ లక్ష్యాలను వంద శాతం పూర్తి చేయాలని జిల్లా వైద్యాధికారి డాక్టర్‌ చందునాయక్‌ సిబ్బందికి సూచించారు. బుధవారం తూప్రాన్‌ పాత పీహెచ్‌సీని ఆయన సందిర్శించి, సిబ్బందితో సమీక్ష సమావేశం నిర్వహించారు. తూప్రాన్‌ పాత పీహెచ్‌సీలో ఉన్న వ్యాక్సిన్‌ను వెంటనే మనోహరాబాద్‌ పీహెచ్‌సీకి తరలించాలని సూచించారు. రెండు రోజుల్లో తూప్రాన్‌ పాత పీహెచ్‌సీ నుంచి సిబ్బందితోపాటు, సామగ్రి అంతా తరలిపోవాలన్నారు. ఆస్పత్రికి వచ్చే రోగులకంటే సిబ్బంది ఎక్కువగా ఉన్నారని, రోగులకు అందే వైద్య సేవలు పెరగాలని చెప్పారు. ప్రతీ సబ్‌ సెంటర్‌ పల్లె దవాఖాన ఏర్పాటు చేయాలన్నారు. పేదలు, గిరిజన ప్రాంతాలకు వెళ్లి వైద్యం అందేలా చూడాలని సూచించారు. ఆయనవెంట డిప్యూటీ డీఎంహెచ్‌వో అరుణశ్రీ, వైద్యులు నిఖిల్‌, సీహెచ్‌ఓలు బాల్‌నర్సయ్య, సాలుబాయి ఉన్నారు.

పీహెచ్‌సీని సందర్శించిన వైద్యాధికారి

మనోహరాబాద్‌: మనోహరాబాద్‌లోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని బుధవారం జిల్లా వైద్యాధికారి చందునాయక్‌ సందర్శించారు. కుష్టువ్యాధి సర్వే గురించి అడిగి తెలుసుకున్నారు. సర్వేను పకడ్బందీగా నిర్వహించాలని సిబ్బందికి సూచించారు. సిబ్బంది సమయపాలన పాటించి విధులు నిర్వహించడంతో పాటు రోగులకు ఎల్లప్పుడు అందుబాటులో ఉండాలని తెలిపారు. పీహెచ్‌సీలో ఏమైనా ఇబ్బందులు ఉంటే తన దృష్టికి తీసుకురావాలని అధికారులకు సూచించారు. అనంతరం గ్రామంలో నూతనంగా నిర్మించనున్న పీహెచ్‌సీ భవన స్థలాన్ని పరిశీలించారు. ఆయనవెంట స్టాఫ్‌ నర్స్‌ శోభారాణి, ఆయుష్‌ అధికారి సురే్‌షకుమార్‌, డిప్యూటీ డీఎంహెచ్‌వో అరుణశ్రీ, పీహెచ్‌సీ వైద్యులు నిఖిల్‌, సీహెచ్‌వో బాల్‌నర్సయ్య ఉన్నారు.

Updated Date - 2022-12-07T23:54:49+05:30 IST