గ్రామాల్లో బతుకమ్మ చీరల పంపిణీ

ABN , First Publish Date - 2022-09-28T05:12:29+05:30 IST

జిన్నారం, గుమ్మడిదల, రుద్రారంలో మంగళవారం మహిళలకు బతుకమ్మ చీరలను ఎమ్మెల్యే మహిపాల్‌రెడ్డి పంపిణీ చేశారు.

గ్రామాల్లో బతుకమ్మ చీరల పంపిణీ
సిర్గాపూర్‌లో బతుకమ్మ చీరలు పంపిణీ చేస్తున్న నారాయణఖేడ్‌ ఎమ్మెల్యే భూపాల్‌రెడ్డి

జిన్నారం/పటాన్‌చెరురూరల్‌/గుమ్మడిదల/తూప్రాన్‌/కంది/కల్హేర్‌/నాగల్‌గిద్ద/మనూరు/రాయికోడ్‌/పుల్‌కల్‌, సెప్టెంబరు 27: జిన్నారం, గుమ్మడిదల, రుద్రారంలో మంగళవారం మహిళలకు బతుకమ్మ చీరలను ఎమ్మెల్యే మహిపాల్‌రెడ్డి పంపిణీ చేశారు. జిన్నారంలో జడ్పీ వైస్‌ చైర్మన్‌ ప్రభాకర్‌, సర్పంచ్‌ లావణ్య, ఎంపీటీసీ వెంకటేశంగౌడ్‌, ఉప సర్పంచ్‌ సంజీవ, నాయకులు శ్రీనివా్‌సరెడ్డి పాల్గొన్నారు. గుమ్మడిదలలో ఎంపీపీ సద్ది ప్రవీణవిజయభాస్కర్‌రెడ్డి, జడ్పీటీసీ కుమార్‌గౌడ్‌, సీనియర్‌ నాయకుడు గోవర్ధన్‌రెడ్డి, నియోజకవర్గ ప్రత్యేక అధికారి ప్రసాద్‌ పాల్గొన్నారు. రుద్రారంలో సర్పంచ్‌ సుధీర్‌రెడ్డి, ఉప సర్పంచ్‌ యాదయ్య, ఎంపీటీసీలు మన్నె రాజు, హరిప్రసాద్‌రెడ్డి పాల్గొన్నారు.తూప్రాన్‌ పడాలపల్లిలో బతుకమ్మ చీరలను తెలంగాణ ఫుడ్స్‌ మాజీ చైర్మన్‌ గంగుమల్ల ఎలక్షన్‌రెడ్డి, మున్సిపల్‌ చైర్మన్‌ బొంది రాఘవేందర్‌గౌడ్‌ పంపిణీ చేశారు. కార్యక్రమంలో కౌన్సిలర్‌ బొంది అరుణవెంకట్‌గౌడ్‌, నాయకులు బాబుల్‌రెడ్డి, దుర్గారెడ్డి, అంజయ్యయాదవ్‌, ఐలే్‌షయాదవ్‌, రాజుయాదవ్‌, రంజిత్‌ పాల్గొన్నారు. కంది మండలం వడ్డెనగూడ తండాలో సర్పంచ్‌ మాణీబాయి, ఎంపీపీ కాల్వ సరళ, జడ్పీటీసీ కొండల్‌రెడ్డి మహిళలకు చీరలను పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఆత్మకమిటీ చైర్మన్‌ కృష్ణాగౌడ్‌, వైస్‌ ఎంపీపీ లక్ష్మణ్‌గౌడ్‌, ఎంపీటీసీలు చెంద్రి శ్రీనివాస్‌, నందకిషోర్‌, ఎంపీడీవో విశ్వప్రసాద్‌, యవజన నాయకుడు మోతీలాల్‌ పాల్గొన్నారు. పటాన్‌ చెరు మండలం చిట్కుల్‌లో సర్పంచ్‌ నీలం మధుముదిరాజ్‌  బతుకమ్మ చీరలను పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఉప సర్పంచ్‌ విష్ణువర్ధన్‌రెడ్డి, వార్డు సభ్యులు ఆంజనేయులు, దుర్గయ్య పాల్గొన్నారు. సిర్గాపూర్‌లో బతుకమ్మ చీరలను నారాయణఖేడ్‌ ఎమ్మెల్యే భూపాల్‌రెడ్డి పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఎంపీపీ మహిపాల్‌రెడ్డి, వైస్‌ ఎంపీపీ ప్రయాగబాయిమాధవరావ్‌, సిర్గాపూర్‌, కడ్పల్‌, అంతర్గాం సర్పంచులు జంగం స్వప్నసంజీవరెడ్డి, రవిపటేల్‌, మండల టీఆర్‌ఎస్‌ అధ్యక్షుడు సంజీవరావ్‌పాటిల్‌ పాల్గొన్నారు. కల్హేర్‌లో నారాయణఖేడ్‌ ఆత్మ కమిటీ చైర్మన్‌ రాంసింగ్‌, ఎంపీపీ గుర్రపు సుశీల, జడ్పీటీసీ నర్సింహారెడ్డి అందజేశారు. కార్యక్రమంలో వైస్‌ ఎంపీపీ నారాయణరెడ్డి, ఎంపీపీ కో ఆప్షన్‌ సభ్యుడు ఎండి గని, ఎంపీటీసీ సంగప్ప, సర్పంచులు కిష్టారెడ్డి, లచ్చవ్వ, ఎంపీడీవో శ్రీనివాస్‌, తహసీల్దార్‌ జయరాం పాల్గొన్నారు. నాగల్‌గిద్దలో ఎమ్మెల్యే భూపాల్‌రెడ్డి బతుకమ్మ చీరలను పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఎంపీపీ మోతిబాయిరాథోడ్‌, టీఆర్‌ఎస్‌ మండలాధ్యక్షుడు మేత్రిపండరి పాల్గొన్నారు. మనూరులో ఎమ్మెల్యే భూపాల్‌రెడ్డి బతుకమ్మ చీరలు పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఎంపీపీ కొంగరి జయశ్రీమోహన్‌రెడ్డి, జడ్పీటీసీ పుష్పబాయి, సర్పంచ్‌ శివాజీరావు, ఎంపీడీవో షాజీలోద్దిన్‌, ఏపీఎం వంశీక్రిష్ణ, టీఆర్‌ఎస్‌ మండలాధ్యక్షుడు విఠల్‌రావు పాల్గొన్నారు. రాయికోడ్‌ మండలం మహ్మదాపూర్‌లో సర్పంచు సంగమేశ్వర్‌పాటిల్‌ బతుకమ్మ చీరలను పంపిణీ చేశారు.  కార్యక్రమంలో ఉప సర్పంచు దుర్గయ్య, పంచాయతీ సెక్రెటరీ లక్ష్మణ్‌, మాజీ సర్పంచు రాజారాంపాటిల్‌, నాయకులు హెచ్‌.మారుతిరావు, వార్డు సభ్యులు అంగన్‌వాడీ పాల్గొన్నారు. చౌటకూర్‌లో అందోలు ఎమ్మెల్యే చంటి క్రాంతికిరణ్‌ బతుకమ్మ చీరలతో పాటు, లబ్ధిదారులకు పింఛన్‌ మంజూరు పత్రాలను, షాదీముబారక్‌ చెక్కులను అందజేశారు. కార్యక్రమంలో టీఆర్‌ఎస్‌ మండలాధ్యక్షుడు చౌకంపల్లి శివకుమార్‌, ఎంపీపీ ఉపాధ్యక్షుడు గాజుల వీరేందర్‌, తహసీల్దార్‌ కిష్టయ్య, ఎంపీడీవో మధులత, ఆత్మ కమిటీచైర్మన్‌ యాదగిరిరెడ్డి, ఆర్‌ఎ్‌సఎస్‌ కో ఆర్డినేటర్‌ పట్లోళ్ల నర్సింహ్మరెడ్డి, సర్పంచుల ఫోరం ఉమ్మడి పుల్కల్‌ మండలాధ్యక్షుడు కిష్టారెడ్డి, టీఆర్‌ఎస్‌ మండల ప్రధాన కార్యదర్శి శ్రీహరి, సర్పంచులు నర్సింహ్మరెడ్డి, శ్రీనివా్‌సరెడ్డి, మాణయ్య, లక్ష్మీబాయి, శ్యాంరావ్‌, ఎంపీటీసీ మాణిక్యరెడ్డి, నాయకులు పట్లోళ్ల విజయభాస్కర్‌రెడ్డి, దర్శన్‌రెడ్డి, విఠల్‌రెడ్డి, గోవర్ధన్‌ముదిరాజ్‌, మాసానిపల్లి నారాయణ, ముకుందంముదిరాజ్‌, చంద్రయ్య పాల్గొన్నారు.


 

Read more