పెన్నార్‌ కాంట్రాక్టు కార్మికుల ధర్నా

ABN , First Publish Date - 2022-09-27T05:51:35+05:30 IST

తమ న్యాయపరమైన డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ పటాన్‌చెరు పారిశ్రామిక వాడలోని బండ్లగూడ పెన్నార్‌ కాంట్రాక్టు కార్మికులు సోమవారం పరిశ్రమ గేట్‌ ముందు ధర్నా నిర్వహించారు.

పెన్నార్‌ కాంట్రాక్టు కార్మికుల ధర్నా
పెన్నార్‌ పరిశ్రమ గేట్‌ ఎదుట ధర్నా చేస్తున్న కార్మికులు

పటాన్‌చెరు, సెప్టెంబర్‌ 26: తమ న్యాయపరమైన డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ పటాన్‌చెరు పారిశ్రామిక వాడలోని బండ్లగూడ పెన్నార్‌ కాంట్రాక్టు కార్మికులు సోమవారం పరిశ్రమ గేట్‌ ముందు ధర్నా నిర్వహించారు. ధర్నాకు మద్దతు తెలిపిన కాంట్రాక్టు వర్కర్స్‌ యూనియన్‌ జిల్లా అధ్యక్షుడు నర్సింహారెడ్డి మాట్లాడుతూ.. పెన్నార్‌ యాజమాన్యం కార్మిక చట్టాలను తుంగలో తొక్కి శ్రమదోపిడికి పాల్పడుతోందన్నారు. 2020-21బోనస్‌ ఇవ్వలేదని, పండగలకు సైతం సెలవులు ఇవ్వకుండా వేధిస్తున్నారన్నారు. ధర్నాలో కార్మిక సంఘం నాయకులు వెంకన్న, రాజు, దీపక్‌, నర్సింహులు, రాజ్‌కుమార్‌, తదితరులు పాల్గొన్నారు.


Read more