ఫైన్ల పేరిట లక్షలు వసూలు చేస్తారా?
ABN , First Publish Date - 2022-06-26T05:40:10+05:30 IST
ఫీజు కట్టే గడువు ముగిసిందని ఫైన్ల పేరిట యాజమాన్యం రూ. లక్షలు వసూలు చేస్తున్నదని ఎంఎన్ఆర్ మెడికల్ కాలేజీ విద్యార్థులు, తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. యాజమాన్యం వైఖరికి నిరసనగా సంగారెడ్డి మండలం ఫసల్వాది గ్రామ శివారులోని ఎంఎన్ఆర్ మెడికల్ కాలేజీ ఆవరణలో విద్యార్థులు శనివారం ఆందోళనకు దిగారు. ఉదయం 11 గంటల నుంచి 2 గంటల వరకు కాలేజీ గేటు ఎదుట బైఠాయించిన నిరసన తెలిపారు.

ఎంఎన్ఆర్ మెడికల్ కాలేజీలో వైద్య విద్యార్థుల ఆందోళన
సంగారెడ్డి రూరల్, జూన్ 25 : ఫీజు కట్టే గడువు ముగిసిందని ఫైన్ల పేరిట యాజమాన్యం రూ. లక్షలు వసూలు చేస్తున్నదని ఎంఎన్ఆర్ మెడికల్ కాలేజీ విద్యార్థులు, తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. యాజమాన్యం వైఖరికి నిరసనగా సంగారెడ్డి మండలం ఫసల్వాది గ్రామ శివారులోని ఎంఎన్ఆర్ మెడికల్ కాలేజీ ఆవరణలో విద్యార్థులు శనివారం ఆందోళనకు దిగారు. ఉదయం 11 గంటల నుంచి 2 గంటల వరకు కాలేజీ గేటు ఎదుట బైఠాయించిన నిరసన తెలిపారు. కాలేజీ వైస్ చైర్మన్ వచ్చి సమస్యలపై చర్చించాలని భీష్మించారు. ఈ సందర్భంగా విద్యార్థులు మాట్లాడుతూ ఫీజు కట్టాల్సిన సమయం దాటిపోయిందని రోజకు రూ. వెయ్యి నుంచి రూ.5,000 వరకు వసూలు చేస్తున్నారని ఆరోపించారు. రూ. లక్షల్లో ఫీజులు వసూలు చేస్తున్నా భోజనం కూడా సరిగ్గా పెట్టడం లేదని వాపోయారు. కళాశాల ప్రిన్సిపాల్, యాజమాన్యం తాము చెప్పినట్టు వినాల్సిందేనని వేధింపులకు గురిచేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అనంతరం ఎమ్ఎన్ఆర్ మెడికల్ కళాశాల వైస్‌చైర్మన్ రవివర్మ సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు.