కొప్పులపల్లి చోరీ కేసులో నిందితుల అరెస్టు
ABN , First Publish Date - 2022-03-06T04:58:04+05:30 IST
మాసాయిపేట మండలం కొప్పుల పల్లి గ్రామంలో చోరీకి పాల్పడిన దొంగలను శనివారం పోలీసులు అరెస్టు చేశారు.
వెల్ధుర్తి, మార్చి 5: మాసాయిపేట మండలం కొప్పుల పల్లి గ్రామంలో చోరీకి పాల్పడిన దొంగలను శనివారం పోలీసులు అరెస్టు చేశారు. వెల్ధుర్తి ఎస్‌ఐ మహేందర్ తెలిపిన వివరాల ప్రకారం.. గత జనవరి 29న కొప్పుల పల్లి గ్రామానికి చెందిన వెంకటస్వామి ఇంట్లో ఎవరూ లేని సమయంలో అతడి చిన్న కుమారుడు పల్లపు అశోక్, పక్కింటికి చెందిన పల్లపు కోటేశులు బీరువా తాళాలను తీసి అందులో ఉన్న బంగారం నెక్లెస్, కమ్మలు, మాటీలను దొంగిలించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు విచారణ జరుపగా ఇంట్లోనివారే నిందితులని తేలింది. తూప్రాన్‌లోని మార్వాడీ దుకాణంలో తనఖా పెట్టి రూ. 50 వేల తీసుకొని ఖర్చు చేసినట్లు తెలిపారు. చోరీ సొత్తును రికవరీ చేశామని ఎస్‌ఐ తెలిపారు.