డెంగీ లక్షణాలతో యువకుడి మృతి

ABN , First Publish Date - 2022-09-12T05:06:03+05:30 IST

డెంగీ వ్యాధి లక్షణాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ యువకుడు మృతిచెందిన సంఘటన ఆదివారం నారాయణరావుపేట మం డలం కోదండరావుపల్లిలో చోటుచేసుకున్నది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. కోదండరావుపల్లికి గ్రామానికి చెందిన చల్ల మల్లారెడ్డి-మాధవి కుమారుడు అజయ్‌రెడ్డి (22) ఐటీఐ పూర్తిచేసి ఇంటి వద్ద ఉంటున్నాడు

డెంగీ లక్షణాలతో యువకుడి మృతి

నారాయణరావుపేట, సెప్టెంబరు 11: డెంగీ వ్యాధి లక్షణాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ యువకుడు మృతిచెందిన సంఘటన ఆదివారం నారాయణరావుపేట మం డలం కోదండరావుపల్లిలో చోటుచేసుకున్నది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. కోదండరావుపల్లికి గ్రామానికి చెందిన చల్ల మల్లారెడ్డి-మాధవి కుమారుడు అజయ్‌రెడ్డి (22) ఐటీఐ పూర్తిచేసి ఇంటి వద్ద ఉంటున్నాడు. వారం నుంచి అజయ్‌ తీవ్ర జ్వరంతో బాధపడుతున్నాడు. కుటుంబ సభ్యులు సిద్దిపేటలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేర్పించారు. అయితే ఐదురోజులైనా జ్వరం తగ్గకపోవడంతో కరీంనగర్‌లోని ప్రైవేటు ఆసుపత్రిలో చేర్పించారు. అక్కడ పరిస్థితి విషమించడంతో శనివారం హైదరాబాద్‌లోని యశోద ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆదివారం తెల్లవారుజామున మృతిచెందాడు. ఈవిషయమై నారాయణరావుపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి డాక్టర్‌ ప్రవీణ్‌ను వివరణ కోరగా యువకుడు వారంగా జ్వరంతో బాధపడుతున్నది వాస్తవమేనని, రిపోర్టుల ఆధారంగా వైరల్‌ ఫీవర్‌తోపాటు ఊపిరితిత్తుల ఇన్‌ఫెక్షన్‌తో బాధపడుతూ మృతిచెందినట్లు తెలిపారు. వర్షాకాలం నేపథ్యంలో ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని, జ్వర లక్షణాలు కనిపిస్తే వెంటనే ఆసుపత్రికి వెళ్లి చికిత్స చేయించుకోవాలని, ఏ మాత్రం నిర్లక్ష్యం చేయకూడదని ఆయన ప్రజలకు సూచించారు. 

Updated Date - 2022-09-12T05:06:03+05:30 IST