అనుమానాస్పద స్థితిలో యువకుడి మృతి

ABN , First Publish Date - 2022-08-16T06:04:25+05:30 IST

మండలంలోని గోపని వెంకటాపురంలో సోమవారం అనుమానాస్పదస్థితిలో ఓ యువకుడు మృతి చెందాడు.

అనుమానాస్పద స్థితిలో యువకుడి మృతి

పెద్దశంకరంపేట, ఆగస్టు 15: మండలంలోని గోపని వెంకటాపురంలో సోమవారం అనుమానాస్పదస్థితిలో ఓ యువకుడు మృతి చెందాడు.  ఎస్‌ఐ బాల్‌రాజ్‌  వివరాల ప్రకారం..  గోపని వెంకటాపురం గ్రామానికి చెందిన గోపని మహేందర్‌(29) ఆదివారం సాయంత్రం 7 గంటల సమయంలో గోపని రుక్కమ్మ అనే మహిళ వ్యవసాయ బోరు చెడి పోయిందని, చూడటానికి పిలిపించింది.  రాత్రి వరకు ఇంటికి తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు చుట్టు పక్కల వెతికినా ఫలితం లేకపోయింది.  సోమవారం ఉదయం బోరుబావి వద్దకు వెళ్లి చూడగా వేపచెట్టుకు ఉరివేసుకొని అనుమానాస్పద స్థితిలో శవమై కనిపించాడు.   మృతుడి తల్లి గోపని సాయమ్మ ఫిర్యాదు మేరకు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు. శవాన్ని పోస్టుమార్టం నిమిత్తం  జోగిపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించామన్నారు.

Read more