మానిటరింగ్‌ బృందాలతో వివరాల సేకరణ

ABN , First Publish Date - 2022-12-15T00:11:27+05:30 IST

కుష్ఠు వ్యాధిని అరికట్టేందుకు గ్రామాల్లోని వ్యాధిగ్రస్తులను గుర్తించడం కోసం మానిటరింగ్‌ బృందాలతో వివరాలు సేరిస్తున్నామని మెడికల్‌ రాష్ట్ర మానిటరింగ్‌ అధికారి డాక్టర్‌ సుధా తెలిపారు. బుధవారం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించి వ్యాధిగ్రస్తుల వివరాలను సేకరించిన రికార్డులను పరిశీలించారు.

మానిటరింగ్‌ బృందాలతో వివరాల సేకరణ
గవ్వలపల్లిలో వ్యాధిగ్రస్తుల వివరాలను తెలుసుకుంటున్న డాక్టర్‌ సుధా

ఇంటింటికి వెళ్లి కుష్ఠు వ్యాధి లక్షణాలను గుర్తిస్తున్న ఆశావర్కర్లు

మెడికల్‌ రాష్ట్ర మానిటరింగ్‌ అధికారి డాక్టర్‌ సుధా

చిన్నశంకరంపేట, డిసెంబరు 14: కుష్ఠు వ్యాధిని అరికట్టేందుకు గ్రామాల్లోని వ్యాధిగ్రస్తులను గుర్తించడం కోసం మానిటరింగ్‌ బృందాలతో వివరాలు సేరిస్తున్నామని మెడికల్‌ రాష్ట్ర మానిటరింగ్‌ అధికారి డాక్టర్‌ సుధా తెలిపారు. బుధవారం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించి వ్యాధిగ్రస్తుల వివరాలను సేకరించిన రికార్డులను పరిశీలించారు. అనంతరం మానిటరింగ్‌ బృందం సభ్యులతో కలిసి పలుగ్రామాలను సందర్శించి వివరాల సేకరణను పరిశీలించారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ మెదక్‌ జిల్లాలోని మెత్తం 72వేల ఇళ్లను ఆశావర్కర్లు సందర్శించి కుష్ఠువ్యాధి లక్షణాలు ఉన్నాయో లేవోనని పరిశీలించి నమోదు చేస్తున్నట్లు చేస్తున్నట్లు తెలిపారు. జిల్లాలో 540 టీంలను ఏర్పాటు చేశామన్నారు. కుష్ఠు వ్యాధుల కేసులు 195 రిటెక్ట్‌ నిర్ధారణలో ఉన్నాయని, ఏడు కేసులు అనుమానాస్పదంగా ఉన్నాయని పేర్కొన్నారు. లక్షణాలు ఉన్న వ్యక్తులకు ప్రభుత్వం ఉచితంగా చికిత్స అందిస్తుందని పేర్కొన్నారు. ఆమె వెంట మెడికల్‌ సూపరిటెండెంట్‌ శ్రీనివా్‌సరావు, టీంసభ్యులు, పలువురు ఉన్నారు.

Updated Date - 2022-12-15T00:11:28+05:30 IST