దళితులు ఆర్థికంగా రాణించాలి : అదనపు కలెక్టర్‌

ABN , First Publish Date - 2022-03-06T05:02:50+05:30 IST

దళితులు ఆర్థికంగా రాణించేందుకే సీఎం కేసీఆర్‌ దళితబంధు పథకం ప్రవేశపెట్టారని సిద్దిపేట జిల్లా అదనపు కలెక్టర్‌ ముజామిల్‌ఖాన్‌ అన్నారు.

దళితులు ఆర్థికంగా రాణించాలి : అదనపు కలెక్టర్‌
నారాయణరావుపేటలో లబ్ధిదారులతో మాట్లాడుతున్న ముజామిల్‌ఖాన్‌

సిద్దిపేట టౌన్‌/నారాయణరావుపేట, మార్చి 5 : దళితులు ఆర్థికంగా రాణించేందుకే సీఎం కేసీఆర్‌ దళితబంధు పథకం ప్రవేశపెట్టారని సిద్దిపేట జిల్లా అదనపు కలెక్టర్‌ ముజామిల్‌ఖాన్‌ అన్నారు. శనివారం సిద్దిపేట పట్టణంలో ట్రైనీ కలెక్టర్‌ ప్రఫుల్‌దేశాయ్‌, మున్సిపల్‌ కమిషనర్‌ రవీందర్‌ రెడ్డి, మాజీ చైర్మన్‌ రాజనర్సులతో కలిసి దళితబంధు పథకానికి ఎంపికైన లబ్ధిదారుల ఇంటికి నేరుగా వెళ్లి దళితబంధులో వారు ఎంచుకున్న యూనిట్లను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్‌ విజేందర్‌రెడ్డి, టీఆర్‌ఎస్‌ పట్టణ అధ్యక్షుడు కొండం సంపత్‌రెడి, బూంపల్లి శ్రీహరి పాల్గొన్నారు. నారాయణరావుపేట మండలం బంజేరుపల్లి గ్రామంలో దళితబంధు పథకానికి అర్హులైన వారితో యూనిట్ల ఎంపికపై నిర్వహించిన అవగాహనా కార్యక్రమంలో అదనపు కలెక్టర్‌ ముజామిల్‌ఖాన్‌ పాల్గొని మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ట్రైనీ కలెక్టర్‌ ప్రఫుల్‌ దేశాయ్‌, డీపీవో దేవకీదేవి, ఎంపీడీవో మురళీధర్‌శర్మ, సర్పంచ్‌ శంకర్‌, డిప్యూటీ తహసీల్దార్‌ రేణుక తదితరులు పాల్గొన్నారు. 

దళితబంధును అర్హులందరికీ అందించాలి

సిద్దిపేట టౌన్‌, మార్చి 5 : రాష్ట్రంలో అర్హులైన దళితులందరికీ దళితబంధు పథకాన్ని అందించాలని కాంగ్రెస్‌ ఎస్సీ సెల్‌ జిల్లా చైర్మన్‌ బొమ్మల యాదగిరి ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. శనివారం సిద్దిపేటలోని ముస్తాబాద్‌ చౌరస్తా వద్ద అర్హులందరికీ దళితబంధు అందించాలని డిమాండ్‌ చేస్తూ కాంగ్రెస్‌ ఆధ్వర్యంలో రెండురోజులపాటు రిలేదీక్షలు చేపట్టారు. ఈ కార్యక్రమంలో వివర్స్‌ సెల్‌ రాష్ట్ర అధ్యక్షుడు గూడూరు శ్రీనివాస్‌, సిద్దిపేట పట్టణ అధ్యక్షుడు అత్తుఇమామ్‌ పాల్గొన్నారు.

Updated Date - 2022-03-06T05:02:50+05:30 IST